టాలీవుడ్ లో విలన్ పాత్రలు దాదాపు బాలీవుడ్ నటులకే వెళ్లిపోతుంటాయి. మన దర్శకనిర్మాతలు ముంబై నుంచే ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్నారు. ఇటీవలి కాలంలో సౌత్ లో ఫేమస్ అరిస్ట్ లను పరిశీలించి ఎంపిక చేస్తున్నారు. తమిళం మలయాళం నుంచి స్టార్లు విలన్లుగా దిగుతున్నారు. ఆ రకంగా టాలీవుడ్ స్టార్ హీరోల రేంజ్ ఎంత మాత్రం తగ్గ కుండా మేకర్స్ విలన్ పాత్రలను డిజైన్ చేస్తూ ముందుకెళ్లడం దశాబ్ధాలుగా జరుగుతున్నదే.
బాలీవుడ్ నుంచి ఇప్పటివరకూ ఎంతో మంది హిందీ నటులు తెలుగులో విలన్ పాత్రలు పోషించారు. అందులో క్లిక్ అయింది చాలా తక్కువ మంది. ఆ రకంగా సోనుసూద్ ఒక్కడే హీరోల రేంజ్ ని టచ్ చేస్తున్నారు. బాలీవుడ్ లో సోనూ వెల్ నోన్ పర్సన్ కావడంతో టాలీవుడ్ కెరీర్ ప్లస్ గా మారింది. ఇతర హిందీ విలన్లతో పోలిస్తే ఎనర్జిటిక్ గా తక్కువ ఏజ్ తో ఉన్నది కూడా సోనూసూద్ కావడం తనకు కలిసొస్తోంది.
అయితే ఇటీవలి కాలంలో ఓ సీనియర్ హిందీ హీరో సోనూకి ఎర్త్ పెడుతున్నట్టే కనిపిస్తోంది. ఇటీవల సోనూ అవకాశాల్ని సునీల్ శెట్టి కొట్టేస్తున్నారన్న టాక్ ఉంది. సునీల్ శెట్టి బాలీవుడ్ లో చాలా చిత్రాల్లో నటించారు. సల్మాన్ ఖాన్- అక్షయ్ కుమార్ల కు ధీటుగా అతడు హీరోగా రాణించారు. కానీ ఆయన దానిని నిలబెట్టుకోవడంలో తడబడ్డారు. ట్యాలెంటెడ్ హీరోనే అయినా ఆయనకు దక్కాల్సిన గుర్తింపు దక్కలేదు. అయితే టాలీవుడ్ కోలీవుడ్ ఇప్పుడు ఆయనకు ఎర్రతివాచీ వేసి మరీ ఆహ్వానిస్తున్నట్లు కనిపిస్తుంది. దీనికి తోడు లక్ కూడా కలిసొస్తే సోనూసూద్ లా కెరీర్ ని బిల్డ్ చేసుకునే అవకాశం సునీల్ కి కనిపిస్తోంది. సునీల్ శెట్టి మంచు విష్ణు నటించిన `మోసగాళ్లు` సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. అనంతరం డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ లైగర్ సినిమాలో ఎంపిక చేసారు.
ఇందులో విజయ్ దేవరకొండ తండ్రి పాత్రలో సునీల్ శెట్టి నటిస్తున్నారు. ఆ పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ సినిమా గనుక హిట్ అయితే సునీల్ కెరీర్ కి చాలా ఉపయోగాలున్నాయి. పాన్ ఇండియా రేంజు లో రిలీజ్ అవుతున్న సినిమా కాబట్టి ఆయన సౌత్ మొత్తం రీచ్ అయ్యే అవకాశం ఉంది. అటుపై విలన్ గా అవకాశాలు మరింత పెరిగే ఛాన్స్ ఉంది! మంచి సపోర్టింగ్ రోల్స్ ఆఫర్ చేసే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఇక లైగర్ ఇప్పటికే విడుదల కావాల్సి ఉంది. కానీ అనివార్య కారణాల వల్ల డిలే అవుతోంది. మేకర్స్ త్వరలోనే రిలీజ్ తేదీని ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. సునీల్ శెట్టి ఇంతకుముందు రజనీకాంత్ `దర్బార్` లో భయంకరమైన విలన్ పాత్రతో మెప్పించిన సంగతి తెలిసిందే.
విజయ్.. వరుణ్ ల సినిమాలతో..!
లైగర్ లో నటిస్తున్న సునీల్ శెట్టి వరుణ్ తేజ్ హీరోగా నటిస్తున్న గనిలోనూ కీలక పాత్రను పోషిస్తుండడం ఆసక్తికరం. గని చిత్రంలో సునీల్ శెట్టి విలన్ గా కనిపించనున్నారు. ఇటీవల సునీల్ శెట్టి బర్త్ డే సందర్భంగా `గని` టీమ్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపింది. `గని` బాక్సింగ్ నేపథ్యంలో ఆద్యంతం ఎమోషనల్ డ్రామా కథాంశంలో సునీల్ శెట్టి విలనీ హైలైట్ కానుంది.
ఎందుకు వెనకబడ్డారు?
బాలీవుడ్ లో అక్షయ్ తో సమాన హోదాను స్టార్ డమ్ ను ఎంజాయ్ చేసిన సునీల్ శెట్టి ఒకానొక దశలో వరస ఫ్లాప్ లతో రేసులో వెనకబడ్డారు. తన యాటిట్యూడ్ సేఫ్ జోన్ ని వెతుక్కోవడమే తాను రేసులో వెనకబడడానికి కారణమని సునీల్ శెట్టి చాలాసార్లు అంగీకరించారు. ఇతర హీరోల్లా తాను ప్రయోగాలు చేసేందుకు ఇష్టపడలేదని నిర్మాతల సేఫ్టీ ఆలోచించడమే అందుకు కారణమని కూడా అన్నారు.