తమిళ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ భారీ అంచనాల నడుమ థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. తమిళంలో మినహా అన్ని భాషల్లో కూడా నిరాశ పరిచింది. కలెక్షన్స్ పరంగా తమిళనాట ఇండస్ట్రీ హిట్ సాధించినప్పటికి తెలుగు.. హిందీలో మాత్రం పొన్నియిన్ సెల్వన్ మినిమం వసూళ్లను రాబట్టలేక ఢీలా పడిపోయిన విషయం తెల్సిందే.
పొన్నియిన్ సెల్వన్ ను థియేటర్ లో చూడని ప్రేక్షకులు కొందరు ఓటీటీ ద్వారా చూసేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఆ మధ్య పొన్నియిన్ సెల్వన్ ను రెంట్ కు అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంచారు. అయితే తెలుగు మరియు తమిళ ప్రేక్షకులు రెంట్ కు ఏ మాత్రం అమెజాన్ లో ఈ సినిమాను చూశారో కానీ ఇప్పుడు హిందీ వర్షన్ ను అమెజాన్ ప్రైమ్ రెంట్ కు ఉంచింది.
తెలుగు మరియు హిందీ వర్షన్ లు ఫ్రీ గానే స్ట్రీమింగ్ అవుతున్నా కూడా హిందీ వర్షన్ ను మాత్రం 199 రూపాయలకు అందుబాటులో ఉంచడం జరిగింది. అమెజాన్ లో పొన్నియిన్ సెల్వన్ ను రెంట్ కు అది కూడా హిందీ వర్షన్ ను ప్రేక్షకులు చూసే పరిస్థితి ఉందా అంటూ కొందరు ముక్కున వేలేసుకుంటున్నారు.
తమిళంలో భారీగానే ఈ సినిమా రాబట్టింది.. కానీ హిందీలో మాత్రం జనాలు ఈ సినిమా గురించి పెద్దగా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఐశ్వర్య రాయ్ తో పాటు బాలీవుడ్ కు సుపరిచితులు అయిన పలువురు సినిమాలో ఉన్నా కూడా జనాలు థియేటర్ల వద్ద క్యూ కట్టలేదు. ఇప్పుడు ఓటీటీ లో రెంట్ కు ఈ సినిమాను చూస్తారా అనేది అనుమానమే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు.
పొన్నియన్ సెల్వన్ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్.. కానీ హిందీ మరియు తెలుగు లో యావరేజ్ సక్సెస్ కూడా అవ్వలేదు. కనుక తమిళ ప్రేక్షకులు కాకుండా మరే ఇతర భాష కు చెందిన ప్రేక్షకులు కూడా డబ్బులు పెట్టి రెంట్ కు పొన్నియిన్ సెల్వన్ ను చూసే సీన్ లేదు అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. హిందీ లో ఫ్రీ గా ఎప్పుడు వస్తుందా అంటూ జనాలు వెయిట్ చేస్తున్నారట.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.