కరోనాతో ప్రముఖ సింగర్ మృతి

Update: 2020-04-03 05:56 GMT
కరోనా వైరస్ తో మరో సింగర్ ప్రాణం పోయింది. దీంతో సినీ పరిశ్రమ యావత్ శోకసంద్రంలో మునిగిపోయింది. కరోనా వైరస్ తో చికిత్స పొందుతూ తాజాగా ప్రముఖ గాయకుడు - సినీ గేయ రచయిత ఆడమ్ స్ల్కే (52) సింగర్ మరణించారు. ఆయన మరణంతో హాలీవుడ్ చిత్ర పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది.

సింగర్ ఆడమ్ మరణంపై ఆయన కుటుంబ సభ్యులు పెట్టిన పోస్టు చూసి హాలీవుడ్ స్టార్ హీరోలు - అభిమానులు సంతాపం తెలిపారు.

స్ల్కే కొద్దికాలం క్రితం భార్యతో విభేదాలతో విడాకులు తీసుకున్నారు. ఆయనకు ఇద్దరు కూతుళ్లు. గ్రామీ - ఎమ్మీ అవార్డులు సొంతం చేసుకున్నారు. క్రేజీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ టీవీ షో ద్వారా మంచి గుర్తింపు పొందారు. ఫౌంటేన్స్ ఆఫ్ వేన్ బ్యాండ్ ను స్థాపించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నాడు.

రెండు దశాబ్ధాలుగా సంగీత ప్రపంచానికి సేవలందించిన ఆడమ్ మరణంపై తాజాగా హాలీవుడ్ నటుడు టామ్ హాంక్స్ తీవ్ర సంతాపం తెలిపారు. ఆయన లేకుండా సంగీత ప్రపంచాన్ని ఊహించుకోవడం చాలా కష్టమన్నారు. జీర్నించుకోలేకపోతున్నానంటూ ట్వీట్ చేశారు.


Tags:    

Similar News