మెగా హీరో కోసం హాలీవుడ్ స్టంట్ మెన్

Update: 2018-03-07 06:48 GMT
కథల సెలెక్షన్లో మెగా హీరోలందరితో పోల్చుకుంటే వరుణ్ తేజ్ ఒక అడుగు ముందే ఉన్నాడు అని అనిపిస్తుంది. కొన్నిసార్లు సినిమాలు ప్లాప్ అయినా వెంటనే మరో సినిమా తో కెరీర్ గ్రాఫ్ ను బాగానే చూసుకుంటున్నాడు. ఫిదా లో అమెరికా రిటర్న్డ్ డాక్టరుగా అలరించి తొలిప్రేమ లో లండన్ లో పనిచేస్తున్న సివిల్ ఇంజనీర్ గా కనపడిన వరుణ్ ఇప్పుడు ఫారిన్ కాదు ఏకంగా అంతరిక్షంలోనే అడుగుపెట్టబోతున్నాడు.

ఘాజి సినిమాతో అలరించిన సంకల్ప రెడ్డి తో చేతులు కలిపి వరుణ్ ఒక స్పేస్ సినిమాకు శ్రీకారం చుట్టబోతున్నాడు అని తెలిసిన విషయమే. ఈ సినిమా కోసం కజకస్థాన్ వెళ్లి మరీ ట్రైనింగ్ తీసుకోబోతున్నాడు మెగా హీరో. ఈ సినిమా తాలూకు లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే.. సంకల్ప జీరో గ్రావిటీ యాక్షన్ సీన్ల కోసం హాలీవుడ్ స్టంట్ మెన్ ను పిలిపించాడంట. ఇప్పటికే సెట్స్ పైన ఒక స్పేస్ షటిల్ తయారీలు కూడా చాలా స్పీడుగా జరిగిపోతున్నాయి. ఇలాంటి సినిమా ఇండియా లోనే మొదటిసారి రావడం కనుక జీరో గ్రావిటీ స్పేస్ సీన్స్ కోసం కొందరు ఎక్స్పీరియన్స్ ఉన్న స్టంట్ మెన్ ను పిలిపించడం జరిగింది అంటూ యూనిట్ సభ్యుల్లో ఒకరు చెప్పారు.

వరుణ్ కూడా సినిమా కోసం చాలా మార్పులు చేసుకుంటున్నాడు. మరోవైపు సంకల్ప కాస్టింగ్ పనులు - సెట్ పనులలో బిజీగా ఉన్నాడు. రాజీవ్ రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. స్పేస్ థ్రిల్లర్ అనే జోనర్ ని పక్కన పెడితే అసలు అంతరిక్షానికి సంబంధించిన సినిమా కూడా ఇప్పటిదాకా తెలుగులో రానే లేదు. పైగా సంకల్ప మొదటి సినిమా ఘాజి తోనే తన టాలెంట్ ఎంటో నిరూపించేసాడు. ఇంకా ఈ సినెమపైన అంచనాలు ఆకాశాన్ని అంటేస్తున్నాయి అనుకోండి.
Tags:    

Similar News