శ్రీనిధి శెట్టి అంటే గుర్తు పట్టడం కాస్త ఆలస్యమవుతుందేమో గానీ.. 'కేజీఎఫ్' హీరోయిన్ అంటే టక్కున పట్టేస్తారు. కన్నడ స్టార్ హీరో యశ్, టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కిన 'కేజీఎఫ్'.. రెండు పార్టులుగా విడుదలై సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతోనే శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. డబ్యూ మూవీ అయినప్పటికీ.. అందం, అభినయం మరియు తనదైన పర్ఫామెన్స్ తో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని దేవవ్యాప్తంగా పాపులర్ అయింది.
'కేజీఎఫ్' మూవీలో శ్రీనిధి శెట్టి పాత్ర నడివి చాలా తక్కువ. అయినాసరే బోలెడంత క్రేజ్ సంపాదించుకుంది. ఈ మూవీ అనంతరం శ్రీనిధి వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోతుందని అందరూ భావించారు. కానీ, దర్శకనిర్మాతలు ఆమెకి ఛాన్స్ లు ఇవ్వడానికి వెనకడుగు వేస్తున్నారట. దానికి కారణం.. ఆమె భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడమే అని గత కొద్ది రోజుల నుంచీ జోరుగా ప్రచారం జరుగుతోంది.
అయితే రీసెంట్ గా శ్రీనిధి శెట్టి 'కోబ్రా' మూవీతో ప్రేక్షకులను పలకరించింది. 'కేజీఎఫ్' తర్వాత శ్రీనిధి శెట్టి నటించిన చిత్రమిది. ప్రయోగాత్మక చిత్రాలకు కేరాఫ్ అయిన కోలీవుడ్ స్టార్ చియాన్ విక్రమ్ ఇందులో హీరోగా నటించారు.
అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ను సెవన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్‌ఎస్ లలిత్ కుమార్ నిర్మించారు. ఆగస్టు 31న విడుదలైన ఈ సినిమా.. ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.
తొలి షో నుంచే మిశ్రమ స్పందన దక్కించుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయింది. దీంతో చేసేదేమి లేక ఈ చిత్రాన్ని లేట్ చేయకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ చేసేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు. కోబ్రా డిజిటల్ రైట్స్‌ను సొంతం చేసుకున్న ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్.. సెప్టెంబర్ ఆఖరి వారం నుంచీ ఈ మూవీని స్ట్రీమింగ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.
ఇకపోతే 'కేజీఎఫ్' మాదిరిగానే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టైతే తనను ఎవరూ ఆపలేరని, తాను ఆడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చేందుకు దర్శకనిర్మాతలు ముందుకు వస్తారని శ్రీనిధి శెట్టి ఎన్నో ఆశలు పెట్టుకుందట. కానీ, 'కోబ్రా' విడుదల తర్వాత ఆమె ఆశలన్నీ గల్లంతు అయ్యాయి. ప్రస్తుతం శ్రీనిధి చేతిలో ఒక్క సినిమా కూడా లేదని అంటున్నారు. మరి ఇప్పటికైనా ఈ బ్యూటీ రెమ్యునరేషన్ తగ్గించుకుని కిందకు దిగొస్తుందా..లేదా.. అన్నది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.