100% తెలుగు ఓటీటీ అంటూ వచ్చిన 'ఆహా'.. ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త వినోదాన్ని అందించే ప్రయత్నం చేస్తోంది. సూపర్ హిట్ సినిమాలు - వెబ్ సిరీస్ లతో పాటుగా ఇతర భాషల్లో విజయవంతమైన చిత్రాలను డబ్బింగ్ చేసి స్ట్రీమింగ్ పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ''చతుర్ ముఖం'' అనే టెక్నో హారర్ థ్రిల్లర్ మూవీని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది ఆహా. మంజు వారియర్ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమా ఈరోజు (ఆగస్ట్ 13) నుంచి స్ట్రీమింగ్ అవుతోంది.
తేజస్విని అనే మధ్య తరగతి కుటుంబానికి చెందిన మహిళ.. టెక్నాలజీ ద్వారా సూపర్ నేచురల్ శక్తులను ఎలా ఎదుర్కొంది అనే కథాంశంతో ''చతుర్ ముఖం'' సినిమా రూపొందింది. ఆ అమ్మాయి వద్దకు ఒక ఫీచర్ ఫోన్ వచ్చిన తర్వాత, ఆమె జీవితంలో ఎలాంటి అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి.. వాటి నుంచి ఆమె ఎలా బయటపడిందా లేదా? అనేదే ఈ సినిమా కథ.
'చతుర్ ముఖం' చిత్రంలో మంజు వారియర్ తో పాటుగా సన్నీ వేన్ - నిరంజన అనూప్ - రోనీ డేవిడ్ మరియు శ్రీకాంత్ మురళి ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రంజీత్ కమలా శంకర్ మరియు సలీల్ వి సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జిస్ టామ్స్ - జస్టిన్ థామస్ కలిసి నిర్మించారు. మంజు వారియర్ కూడా చిత్ర నిర్మాణంలో భాగస్వామిగా ఉన్నారు.
'చతుర్ముఖం' మలయాళ వెర్షన్ బుసాన్ ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిల్మ్ ఫెస్టివల్ - చుంచియాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ - మేలిస్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్ వంటి పలు అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమైందిని తెలుస్తోంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా.. ఇప్పుడు 'ఆహా' ఓటీటీ ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోంది. హారర్ థ్రిల్లర్ చిత్రాలను చూడటానికి ఇష్టపడే వారికి 'చతుర్ ముఖం' బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.