హీరోలకి సినిమాల్లోనే కోపం వస్తుందా... రియల్ లైఫ్ లో రాదా? వస్తే వాళ్ళు ఏం చేస్తారు?.. ఒకవేళ చుట్టూ అందరూ ఉన్నారంటే మాత్రం వీలైనంతగా వాళ్ళు ఎమోషన్స్ కంట్రోల్ చేసుకుంటారు. అలా కాకుండా ఉంటే మాత్రం స్ట్రాంగ్ డోస్ ఇస్తారు. రీసెంట్ గా ఒక కార్పోరేట్ హాస్పిటల్ కి ఇలాంటి అనుభవం ఎదురైందట.
విషయంలోకి వెళ్తే.. ఓ టాలీవుడ్ హీరో ఈమధ్య తండ్రయ్యాడు. ఆ హీరో సహజంగానే ఫ్యామిలీ మ్యాన్.. దాంతో తన బిడ్డతో మంచి ఫోటో షూట్ చేసి మీడియా కు రిలీజ్ చేద్దామని ప్లాన్ చేసుకున్నాడు. కానీ అత్యుత్సాహం చూపించిన హాస్పిటల్ స్టాఫ్ ఆ బేబీ ఫోటోలను తీయడం.. సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. దీంతో మన హీరో ఫోటో షూట్ ప్లాన్స్ మీద నీళ్ళు చల్లినట్టయింది. ఒళ్ళు మండిపోయిన హీరో హాస్పిటల్ మేనేజ్మెంట్ కి ఓ స్ట్రాంగ్ డోస్ ఇచ్చాడట.. ఇక మీ హాస్పిటల్ లో ఎప్పటికీ అడుగుపెట్టనని వార్నింగ్ ఇచ్చాడట. సదరు హీరో దెబ్బకు వాళ్ళకు తత్త్వం బోధపడి - ఇక భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటామని.. ఎలాగో హీరోను మెల్లగా కన్విన్స్ చేసుకున్నారట.
మరి ఇలాంటివి సంఘటనలు ఫ్యూచర్ లో మళ్ళీ జరగకుండా ఉండటానికి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టారట. నర్సులు - సపోర్ట్ స్టాఫ్ - జూనియర్ డాక్టర్లు ఇలా దాదాపుగా అందరూ తమ ఫోన్లను బైట లాకర్ పెట్టి విధులకు హాజరు కావాలంటూ ఆదేశించారట. ఇప్పుడు చెప్పండి.. హీరోనా మజాకానా?