హాట్‌ బ్యూటీ అరెస్ట్‌.. ధృవీకరించిన మరో హాట్ బ్యూటీ

Update: 2023-01-19 13:19 GMT
బాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు తన హాట్ ఫొటోలు మరియు వీడియోలు ఇంకా తన యొక్క వివాదాస్పద చర్యల కారణంగా దేశ వ్యాప్తంగా పాపులారిటీని సొంతం చేసుకున్న ముద్దుగుమ్మ రాఖీ సావంత్‌. తాజాగా రాఖీ సావంత్ ను పోలీసులు అరెస్ట్‌ చేయడం జరిగిందట. ఈ విషయాన్ని మరో హాట్ బ్యూటీ షెర్లిన్‌ చోప్రా సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది.

రాఖీ సావంత్ ఎప్పుడైతే ఆదిల్‌ ను వివాహం చేసుకుందో అప్పటి నుండి కూడా ఇలాంటి వివాదాస్పద వార్తలతో మీడియాలో నిలుస్తూ ఉంది. అంతే కాకుండా పోలీసు కేసులు కూడా ఈమె పై ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు రాఖీ సావంత్ ఎందుకు అరెస్ట్‌ అయ్యింది అనే విషయాన్ని షెర్లిన్ చోప్రా ఎఫ్‌ఐఆర్ కాపీతో సహా సోషల్‌ మీడియా ద్వారా షేర్ చేసింది.

గతంలో షెర్లిన్ చోప్రా చేసిన ఫిర్యాదు మేరకు విచారణ చేసిన అంబోలి పోలీసులు ఇప్పుడు రాఖీ సావంత్ ను అరెస్ట్‌ చేయడం జరిగిందని బాలీవుడ్‌ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను మరియు అధికారిక ప్రకటనను పోలీసులు వెళ్లడించాల్సి ఉంది.

రాఖీ సావంత్ మరియు షెర్లిన్ చోప్రాలు ఇద్దరు కూడా సోషల్‌ మీడియా వివాదాస్పద నటీమనులు అనే విషయం తెల్సిందే. వీరిద్దరు కూడా ఇలా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవడం చాలా కాలంగా జరుగుతుంది. ఇప్పుడు ఏకంగా అరెస్ట్‌ ల వరకు వెళ్లడంతో వీరిద్దరి మధ్య వివాదం మరింత దూరం వెళ్లే అవకాశాలు ఉన్నాయి అంటూ ప్రచారం జరుగుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News