ఒక సినిమాకే అలా అంటే ఎలా?

Update: 2022-05-11 08:30 GMT
క‌న్న‌డ రాకింగ్ స్టార్ య‌ష్ న‌టించిన సంచ‌ల‌న చిత్రం 'కేజీఎఫ్ 2'. ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఇటీవ‌ల విడుద‌లై దేశ వ్యాప్తంగా వ‌సూళ్ల వ‌ర్షం కురిపిస్తోంది. 'కేజీఎఫ్ చాప్ట‌ర్ 1' సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డంతో ఆ మూవీకి సీక్వెల్ గా విడుద‌లైన యాప్ట‌ర్ 2 పై ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని స్థాయిలో సినిమా వుండ‌టంతో 'కేజీఎఫ్ 2' కు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు దేశ వ్యాప్తంగా బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. విడుద‌లైన ప్ర‌తి భాష‌లోనూ వ‌సూళ్ల ప్ర‌భ‌జ‌నం సృష్టిస్తూ ట్రేడ్ వ‌ర్గాల‌ని విస్మ‌యానికి గురిచేస్తోంది.

ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో రాఖీభాయ్ హ‌వా అదే స్థాయిలో కొన‌సాగుతోంది. ఇక బాలీవుడ్ లో మాత్రం రికార్డు స్థాయిలో వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి సంచ‌ల‌నంగా మారింది. బాలీవుడ్ లో హిందీ డ‌బ్బింగ్ వెర్ష‌న్ ఏకంగా రూ. 400 కోట్లు వ‌సూలు చేసి అక్క‌డి వారిని షాక్ కు గురిచేస్తోంది. ఇప్ప‌టికే 'పుష్ప‌' బాలీవుడ్ వ‌ర్గాల‌కు నైట్ మోర్ గా మారి ఇబ్బందులు క్రియేట్ చేస్తుంటే 'కేజీఎఫ్ 2' అంత‌కు మించి అన్న‌ట్టుగా 400 కోట్లు వ‌సూలు చేయ‌డం అక్క‌డి స్టార్స్ కి కంటి మీద కునుకులేకుండా చేస్తోంది. బాలీవుడ్ లో ఇప్ప‌టి వ‌ర‌కు సెకండ్ హ‌య్యెస్ట్ గ్రాస‌ర్ గా రికార్డు ని సొంతం చేసుకున్న కేజీఎఫ్ 2 భారీ వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి మొద‌టి స్థానంలో నిలిచిన 'బాహుబ‌లి 2' రికార్డుపై క‌న్నేసింది.

ఉభ‌య తెలుగు రాష్ట్రాలు, హిందీ బెల్ట్ ప‌రిస్థితి ఇలా వుంటే త‌మిళ‌నాడులోనూ రాఖీ భాయ్ ఇదే హావాను కొన‌సాగిస్తున్నాడు. త‌మిళనాడులో క‌న్న‌డ డ‌బ్బింగ్ చిత్రాల‌కు పెద్ద‌గా ఆద‌ర‌ణ వుండ‌దు కానీ 'కేజీఎఫ్ 2' ఆ విష‌యంలో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. అక్క‌డ కూడా భారీ వ‌సూళ్ల‌ని రాబ‌డుతూ విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోంది. తాజాగా అక్క‌డ సాధించిన వ‌సూళ్ల ప‌రంగా 'కేజీఎఫ్ 2' స‌రికొత్త రికార్డుని సొంతం చేసుకుంది. త‌మిళ స్టార్ హీరో అజిత్ న‌టంచిన 'వాలిమై' లైఫ్ టైమ్ వ‌సూళ్ల‌ని సాధించ‌డం ఇప్ప‌డు అక్క‌డ హాట్ టాపిక్ గా మారింది.  

రానున్న వారంలో ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టించిన 'బీస్ట్' మూవీ క‌లెక్ష‌న్స్ ని కూడా అధిగ‌మించ‌డం ఖాయం అని ట్రేడ్ వ‌ర్గాలు వాపోతున్నాయి. ఇదే గ‌న‌క జ‌రిగితే త‌మిళ‌నాట ఈ ఏడాది అత్య‌ధిక వ‌సూళ్ల‌ని రాబ‌ట్టిన చిత్రంగా 'కేజీఎఫ్ 2' నిల‌వ‌డం కాయం అని అంటున్నారు. త‌మిళ స్టార్ హీరోల చిత్రాల వ‌సూళ్ల‌ని క‌న్న‌డ డ‌బ్బింగ్ సినిమా అధిగ‌మించ‌డం ఇదే తొలిసారి కావ‌డంతో ఇదొక రికార్డుగా చెబుతున్నారు. తాజా ప‌రిణామాల నేప‌థ్యంలో త‌మిళ‌నాట బాక్సాఫీస్ వ‌ద్ద అజిత్‌, విజ‌య్ ల‌ని వెన‌క్కి నెట్టి యష్ పెద్ద స్టార్ గా అవ‌త‌రించాడ‌ని చెబుతున్నారు.

ఒక్క సినిమా కే అలా అంటే ఎలా? అన్న‌ది చాలా మంది వాద‌న. ఓన్లీ వ‌న్ ఫిల్మ్ రికార్డుల‌తో మిగ‌తా హీరోల స‌త్తాని త‌క్కువ‌గా అంచ‌నా వేయ‌డం క‌రెక్ట్ కాదు. విజ‌య్ కున్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. అయితే అలాంటి స్టార్ హీరోకు ఇంత వ‌ర‌కు పాన్ ఇండియా రేంజ్ లో రికార్డుల మోత మోగించ‌గ‌ల క‌థ ప‌డ‌లేదు. ప‌డితే క‌థ వేరే వుంట‌ది. ఇది ట్రేడ్ లో ప్ర‌తీ ఒక్క‌క‌రికీ తెలుసు. పాన్ ఇండియా ట్రై చేయ‌డం లేదు అంతే.. ట్రై చేస్తే ఆ క‌థే వేరు. ఒక్కో స్టేట్ కి ఆ స్టేట్ లో వున్న స్టారే కింగ్.. అలా కాకుండా ఒక్క సినిమానే ప్రామాణికంగా తీసుకుని ఎన‌లైజ్ చేయ‌డం అన్న‌ది క‌రెక్ట్ కాద‌ని కొంత మంది వాదిస్తున్నారు.  

అయితే స్టేట్ లెవెల్ స్టార్స్ కూడా పాన్ ఇండియా స్థాయిలో స‌త్తా చూపించ‌డానికి అందుకు త‌గ్గ క‌థ‌ల‌ని ఎంచుకోవాల్సిన స‌మ‌యం వ‌చ్చేసింది. ఇప్పుడు కూడా మ‌డ‌క‌ట్టుకుని ఇదే స్థాయి క‌థ‌లు చేస్తానంటే కుద‌ర‌దు. రేస్ లో వెన‌క‌బ‌డిపోవాల్సి వ‌స్తుంది. స్టార్ డ‌మ్ ని నిల‌బెట్టుకుంటూనే పాన్ ఇండియా లెవెల్లో ప్రేక్ష‌కుల్ని అల‌రించే క‌థ‌ల‌పై ఇప్ప‌టికైనా త‌మిళ స్టార్స్ దృష్టిపెడితే మంచిద‌ని ఇన్ సైడ్ టాక్‌.
Tags:    

Similar News