తన సంగీత దర్శకత్వంలో వందల కొద్దీ పాటలు పాడిన ఎస్పీ బాలసుబ్రమణ్యంకు ఇళయరాజా లీగల్ నోటీసులివ్వడంపై పెద్ద చర్చే నడుస్తోందిప్పుడు. తన పాటలకు సంబంధించి ఇళయరాజా రాయల్టీ కోరుకోవడంలో తప్పు లేదన్న వాదన ఉన్నప్పటికీ తనతో వ్యక్తిగతంగా మంచి సంబంధాలున్న.. పైగా ఎంతో గౌరవనీయమైన వ్యక్తి అయిన బాలుకు ఆయన లీగల్ నోటీసు ఇవ్వాల్సింది కాదని.. ఏదైనా మాట్లాడి తేల్చుకోవాల్సిందన్న అభిప్రాయమూ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇళయరాజా నోటీసులపై బాలు చాలా హుందాగా స్పందించారు. ఈ వివాదంపై తన ఫేస్ బుక్ పేజీలో బాలు ఒక మెసేజ్ పెట్టాడు. ఆయనేమన్నాడంటే..
‘‘ఇళయరాజా గారితో నేను నేరుగా మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించుకోవాల్సిందని మిత్రులు సలహా ఇస్తున్నారు. కానీ ఆయన నాతో నేరుగా మాట్లాడటం కానీ.. మెయిల్ పంపించడం కానీ చేసి ఉంటే నేను కూడా కచ్చితంగా ఆయనతో మాట్లాడి ఉండేవాడిని.నాకు ఆయన లీగల్ నోటీసు పంపారు కాబట్టి నాకు ఇష్టం లేకపోయినా చట్టబద్ధంగానే స్పందించాల్సి ఉంటుంది. నాకు కూడా ఆత్మ గౌరవం ఉంది. ఈ చర్చను ఇంతటితో ముగించి.. ముందుకెళ్లిపోదాం. ఐతే జనాల్ని ఈ విషయంలో ముందుగా సిద్ధం చేయడం కోసమే నేను ఈ సమాచారాన్ని పంచుకుంటున్నా. నా మంచి మిత్రుడైన ఇళయ రాజాకు అసౌకర్యం కలిగించాలని నేను కోరుకోవడం లేదు. అలాగే నా స్పాన్సర్లు.. ఆర్గనైజర్లు మానసికంగా.. ఆర్థికంగా దెబ్బతినాలని కూడా కోరుకోవడం లేదు’’ అని బాలు ముగించారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/