కొన్ని రోజుల కిందట కోలీవుడ్లో ఓ వివాదం తీవ్ర చర్చనీయాంశమైంది. ధన్సిక అనే కథానాయికను సీనియర్ దర్శక నిర్మాత.. నటుడు టి.రాజేందర్ తామిద్దరం కలిసి నటించిన ఓ సినిమా వేడుకలో భాగంగా తీవ్ర స్థాయిలో దూషించడం వివాదాస్పదమైంది. తన ప్రసంగం సందర్భంగా ధన్సిక తన గురించి ప్రస్తావించకపోవడంతో రాజేందర్ కు కోపం వచ్చేసి ఆమెను వేదిక మీదే తిట్టిపోశాడు. ఇది సినిమా పబ్లిసిటీ కోసం వేసిన ఎత్తుగడ అంటూ ఆయన కవర్ చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. ధన్సిక వేదిక మీదే ఆవేదనతో ఏడ్చేయడంతో టి.రాజేందర్ మీద విమర్శల వర్షం కురిసింది. ఈ వివాదంపై ధన్సిక ఇప్పుడు స్పందించింది. రాజేందర్ మాటలు తనను తీవ్రంగా బాధించాయని ఆమె చెప్పింది.
టి.రాజేందర్ ఆధ్యాత్మిక భావాలున్న వ్యక్తి అని అందరూ చెబుతుంటారని.. కానీ ఆ రోజు ఆయన చాలా దారుణంగా ప్రవర్తించారని ధన్సిక ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఏ వ్యక్తి కూడా అలా అరవడం మంచిది కాదని ఆమె అంది. గతంలో తనకు చాలా కోపం ఉండేదని.. ఐతే ఆధ్యాత్మిక భావాలు పెంపొందించుకోవడంతో కోపం తగ్గించుకున్నానని ఆమె చెప్పింది. అందుకే ఆ రోజు వేదికపై చాలా నిశ్శబ్ధంగా ఉన్నానంది. ఐతే రాజేందర్ దూషించడం వల్ల చాలా బాధపడ్డానని.. ఆ ఘటన తర్వాత ఇంటి నుంచి బయటకు రావడానికి వారం పట్టిందని చెప్పింది. ఇప్పుడు తాను బాగానే ఉన్నానని ఆమె తెలిపింది. ధన్సిక ప్రస్తుతం తెలుగు.. తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ‘వాలుజడ’ అనే సినిమాలో నటిస్తోంది.