పాత సినిమాల్నేకొత్త‌గా తీయ‌డ‌మెలా!

Update: 2019-12-20 05:33 GMT
క్రియేట‌ర్ అంటే కొత్త‌గా ఆలోచించాలి. క్రియేటివ్ స్టోరీలు రాయాలి.. అప్పుడే జ‌నాల్ని ఆక‌ట్టుకోగ‌ల‌రు. అయితే ఇదంతా ఒక‌ప్ప‌టి మాట‌. జ‌నాల్ని ఒప్పించ‌గ‌లిగే టాలెంట్ వుండాలి కానీ..  పాత క‌థ‌ల్నే మ‌ళ్లీ కొత్త‌గా ప్రెజెంట్ చేసి ఆక‌ట్టుకోవ‌చ్చని కొంద‌రు నిరూపిస్తున్నారు. ఇంత‌కు ముందు వ‌చ్చిన సినిమా లైన్ ని నైస్ గా ఎత్తేసి దానికి కొత్త పంథాలో లేటెస్ట్ స్క్రీన్ ప్లే ఫార్మాట్ లో.. కొత్త‌ టెక్నిక్ తో ప్ర‌స్తుత‌ అంశాల్ని జోడించి నేటిత‌రం హీరోల‌తో తీసే ట్యాలెంట్ ఉంటే చాలు. హీరోల‌కు పాత క‌థ‌ల్ని కొత్త‌గా చెప్పే ట్యాలెంటు ఉన్నా గొప్పే. హీరో మార్పుతో.. బ‌డ్జెట్ల సాయంతో  పాత క‌థ‌ల్ని కాస్త ఒప్పించ‌గ‌లిగేలా అక్క‌డ‌క్క‌డా కొన్ని కీల‌క స‌న్నివేశాల్ని మార్చి ఇంకాస్త‌ కొత్త‌గా చేస్తే చాలు.. అలాంటి ద‌ర్శ‌కుల‌కు అవ‌కాశాలు ప‌దే ప‌దే వెంట‌ప‌డ‌తాయి.

ద‌ర్శ‌కుడిగా అత‌డికి అప్ప‌టికే హిట్లు ఉంటే.. పేరు మార్మోగితే ఏవైనా లోటుపాట్లు ఉన్నా ఎవ‌రూ ప‌ట్టించుకోరు. ప్ర‌శ్నించ‌నూలేరు. ఇక రివ్యూల్లో పాత క‌థ‌ల్ని కొత్త‌గా వండారు! అని విమ‌ర్శించినా దానిని ప‌ట్టించుకునే ప‌రిస్థితిలో ఆడియెన్ కూడా ఉండ‌డం లేదు. వేరొక ఆప్ష‌న్ లేన‌ప్పుడు క‌చ్ఛితంగా రొటీన్ సినిమానే ఆప్ష‌న్ అనుకుని థియేట‌ర్ల‌కు వెళ్లాల్సిన ప‌రిస్థితి. ఇలాంటి రొటీన్ సినిమాల‌కు స్టార్ ప‌వ‌ర్ ఉంటే జ‌నం థియేట‌ర్ల‌కు వ‌స్తారు.

ఇటీవ‌ల కాలంలో క్రియేటివిటీతో కొత్త క‌థ‌ల్ని ఎంచుకుంటూ న‌వ‌త‌రం ద‌ర్శ‌కులు ప్ర‌యోగాలు చేస్తున్నా కొంద‌రు వెట‌ర‌న్స్ మాత్రం అదే పాత మూస క‌థ‌ల్ని ఎంచుకుంటూ రొటీనిటీనే రుద్దేస్తున్నార‌న్న విమ‌ర్శలు వ‌స్తున్నాయి. ఇలాంటి వాళ్ల వ‌ల్ల‌.. ఇక్క‌డ క్రియేటివ్‌గా ఆలోచించాల్సిన అవ‌సరం ఏమీ లేదు. క్రియేటివిటీ వున్న వాళ్ల‌కే అవ‌కాశాలు వ‌స్తాయ‌న్న మాటా అబ‌ద్ధం అవుతోంది. ఇక్క‌డ టాలెంట్ కంటే క‌మ్యూనికేషన్ ప‌దింత‌లు ఎక్కువ‌ అవ‌కాశాలు ఇస్తుంటుంది. అయితే ఎంత క‌మ్యూనికేష‌న్ వున్నా వ‌చ్చిన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త క‌థ‌ల్ని వండే టైమ్ లేక‌పోతే క‌నీసం.. రొటీన్ కథ‌ల్ని ఎంచుకుని ఒప్పించ‌డం అనేది మ‌గ‌త‌నం అవుతుంది ఒక్కోసారి. ఆ టెస్ట్ లో స‌క్సెస్ అయిన‌వాడే ఇక్క‌డ ద‌ర్శ‌కుడిగా చెలామ‌ణి కాగ‌ల‌డు! ఇంత క‌ఠోర‌మైన‌ బ్ర‌హ్మ‌ర‌హ‌స్యం తెలిసీ విక్ర‌మార్కా ఎందుక‌ని ఆ గుట్టు కాస్తా బ‌య‌ట‌కు చెప్ప‌వు?
Tags:    

Similar News