ఒక్క సాంగ్ కి 2 కోట్ల హిట్సా?

Update: 2015-09-11 14:54 GMT

Full View
హ్రితిక్ రోషన్, సోనమ్ కపూర్ లతో తీసిన ధీరే ధీరే సాంగ్ కు ఇప్పటికి రెండు కోట్లకు పైగా హిట్స్ వచ్చాయ్. టీ సిరీస్ అధినేత, మ్యూజిక్ డైరెక్టర్  గుల్షన్ కుమార్ కి నివాళిగా.. ఆయన ఓ సూపర్ హిట్ సాంగ్ ఒకదాన్ని రీమిక్స్ చేశారు. ఈ ఐడియా గుల్షన్ కొడుకు భూషణ్ కుమార్ ది.

అనుకున్నదే తడవుగా ధీరె ధీరే సే మేరీ జిందగీ అంటూ సాగే పాటని.. హ్రితిక్, సోనమ్ లపై చిత్రీకరించి.. మ్యూజిక్ వీడియోగా రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన పది రోజుల్లో ఈ సాంగ్ ని యూట్యూబ్ లో 2కోట్లకు పైగా నెటిజన్లు వీక్షించారు. 1990ల్లో సూపర్ హిట్ అయిన ఈ పాటకు.. ఇప్పటికీ ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో ఈ కౌంట్ చూస్తేనే అర్ధమవుతుంది.

హ్రితిక్, సోనమ్ లు ఎంతో క్యూట్ గా కనిపించారు. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా భలేగా కుదిరింది ఈ మ్యూజిక్ వీడియోలో. ఓ లవ్ స్టోరీ మొత్తాన్ని సాంగ్ లో చూపించిన విధానం మాత్రం సూపర్బ్. కంపోజర్ యోయో హనీ సింగ్ కూడా ఫుల్ హ్యాపీగా ఉన్నాడు. తండ్రికి సరైన నివాళి ఇచ్చాడంటూ.. భూషణ్ ని పొగిడేస్తున్నాడు హ్రితిక్ రోషన్. సాంగ్ చివర్లో ఫినిషింగ్ గా హ్రితిక్ వేసిన ఓ స్టెప్ కోసం అయితే.. ఈ సాంగ్ ఎన్నిసార్లయినా చూడచ్చనిపిస్తుంది.
Tags:    

Similar News