మిగతా ఫిలిం ఇండస్ట్రీలకు టాలీవుడ్ కు ఉన్న ఒక ప్రధానమైన తేడా ఏంటంటే మనకు కామెడీ ఎక్కువ. కమెడియన్స్ కూడా ఎక్కువే. ఉదాహరణకు బాలీవుడ్ ను తీసుకోండి. గుక్కతిప్పుకోకుండా మీకు తెలిసిన బాలీవుడ్ కమెడియన్ల పేర్లు మూడు చెప్పండి చాలు..! ఇప్పుడు కోలీవుడ్ కు వెళ్దాం.. అక్కడ కమెడియన్ల నంబర్ కాస్త ఎక్కువే. అయినా మీకు తెలిసిన కమెడియన్ల పేర్లు ఒక ఐదు చెప్పండి. ఇక టాలీవుడ్ కు వస్తే ఏ లీగ్ కమెడియన్స్ కనీసం పదిమంది ఉంటారు. వీరు కాకుండా జబర్దస్త్ బ్యాచ్ మరో 15 మంది. ఇంతమంది కమెడియన్స్ మరెక్కడా ఉండరు.
ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వచ్చిందంటే రాహుల్ రామకృష్ణ వల్ల. 'అర్జున్ రెడ్డి' సినిమాలో సైకో అర్జున్ రెడ్డికి మంచి స్నేహితుడిగా నటించి.. అందరినీ మెప్పించి లైమ్ లైట్ లోకి వచ్చిన రాహుల్ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. లీడ్ యాక్టర్ గా కూడా నటించాడు. అయితే ఈ వారం రిలీజ్ అయిన 'కల్కి'.. 'బ్రోచేవారెవరురా' సినిమాలతో ఒక్కసారిగా మరోసారి హాట్ టాపిక్ అయ్యాడు. ఈ రెండు సినిమాలలో రాహుల్ రామకృష్ణ జస్ట్ ఏదో రెండు మూడు సీన్లు ఒక కమెడియన్ అన్నట్టుగా కాకుండా ప్రాధాన్యత ఉండే పాత్రలో నటించి తన సహజనటనతో ప్రేక్షకులను క్లీన్ బౌల్డ్ చేశాడు.
తనదైన టైమింగ్ తో పంచ్ లు విసురుతూ కామెడీ పంచుతూనే ఎమోషనల్ సీన్లలో తనలోని సహజ నటుడిని అందరికీ చూపించాడు రాహుల్ రామకృష్ణ. 'కల్కి'.. 'బ్రోచేవారెవరురా' రెండు సినిమాలు చూసిన వారు రాహుల్ పై ప్రత్యేకంగా ప్రశంసలు కురిపిస్తుండడం గమనార్హం.