సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దాదాపు పుష్కర కాలం తరువాత కలిసి చేస్తున్న మూవీ SSMB28 (వర్కింగ్ టైటిట్). 'ఖలేజా' వంటి యాక్షన్ మూవీ తరువాత మహేష్ తో త్రివిక్రమ్ మళ్లీ అంతకు మించిన యాక్షన్ మూవీని చేయాలని ప్లాన్ చేశారు. కథ విషయంలో తర్జన భర్జనలు నడిచాయి. ఫైనల్ గా స్టోరీ ఓకే అయింది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్నఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఆరు నెలల సమయం పట్టింది.
ఫైనల్ గా సెప్టెంబర్ 12న అన్నపూర్ణ స్టూడియోస్ లో భారీ యాక్షన్ సీక్వెన్స్ తో షూటింగ్ ని మొదలు పెట్టారు. అన్బు అరివుల నేతృత్వంలో షూటింగ్ మొదలు పెట్టారు. ఆ తరువాత మూడు రోజుల తరువాత రామోజీ ఫిల్మ్ సిటీకి షిఫ్ట్ చేశారు. అక్కడ కీలక ఘట్టాలతో తొలి షెడ్యూల్ ని పూర్తి చేశారు. కట్ చేస్తే.. మహేష్ మదర్ చనిపోవడం.. ఆ సంఘన నుంచి తేరుకునేలోనే సూపర్ స్టార్ కృష్ఱ మృతిచెందడం.. ఆ తరువాత కథలో మళ్లీ మార్పులు జోటు చేసుకోవడం వంటి కారణాలతో ఏకంగా ఈ మూవీ స్టోరీనే మొత్తంగా మారిపోయింది.
దీంతో ఫస్ట్ షెడ్యూల్ లో చేసిన షూటింగ్ ఫుటేజ్ ని మొత్తంగా పక్కన పెట్టేశారు. ఇప్పడు కొత్త కథతో సినిమాని మొదలు పెట్టాలని ప్లాన్ చేశారు. ముందు అనుకున్న కథ యాక్షన్ ఎంటర్ టైనర్ కావడంతో తమన్ అందుకు తగ్గట్టుగానే ట్యూన్ లు రెడీ చేశాడు. అయితే ప్రస్తుతం స్టోరీ మారింది.. దీంతో మళ్లీ మ్యూజిక్ ని కూడా మార్చేస్తున్నారు. ఇందు కోసం మ్యూజిక్ సిట్టింగ్స్ ని తాజాగా దుబాయ్ లో మొదలు పెట్టారు. వరుస విషాదాల నుంచి తేరుకున్న మహేష్ రీసెంట్ గా 'మౌంటెన్ డ్యూ' యాడ్ షూట్ లో పాల్గొనడం కోసం దుబాయ్ వెళ్లాడు.
అక్కడ రెండు మూడు రోజుల పాటు జరిగిన షూట్ తో యాడ్ షూట్ పూర్తయిపోయింది. మహేష్ అక్కడే వుండటంతో త్రివిక్రమ్, తమన్, సూర్యదేవర నాగవంశీ హుటా హుటిన దుబాయ్ కి వెళ్లిపోయారు. అక్కడ కాస్ట్లీ హోటల్ లో ప్రత్యేకంగా వేరు వేరు సూట్ లు బుక్ చేసుకుని కొత్తగా మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలు పెట్టారట. షూటింగ్ మొదలు కాకుండానే ఈ ప్రాజెక్ట్ కు కోట్లల్లో ఖర్చు అయినట్టుగా తెలుస్తోంది. షూటింగ్ ఆలస్యం కావడంతో ఆర్టిస్ట్ ల కాల్షీట్ లు, ఫస్ట్ షెడ్యూల్, అంతకు ముందు దుబాయ్ లో స్టోరీ సిట్టింగ్స్.. తరువాత సిట్టింగ్స్..రిపీటెడ్ గా మ్యూజిక్ సిట్టింగ్స్ తో ఖర్చు తడిసిమోపెడవుతున్నట్టుగా తెలుస్తోంది.
గతంలో 'ఖలేజా' సినిమా విషయంలోనూ ఇదే తరహాలో వృధా ఖర్చులు కోట్లల్లో చేశారని, తాగే వాటర్ కే ఊమించని విధంగా ఖర్చు చేశారని అప్పట్లో ఇండస్ట్రీ కోడై కూసింది. మళ్లీ ఇన్నేళ్ల తరువాత మహేష్ తో సినిమా చేస్తూ త్రివిక్రమ్ అదే స్థాయిలో వృధా ఖర్చులు కోట్లల్లో చేస్తుండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. షూటింగ్ మొదలు పెట్టకుండానే కోట్లు ఖర్చు చేస్తే రేపు సినిమా పూర్తయ్యే సరికి త్రివిక్రమ్ ఎన్ని కోట్లు ఖర్చు చేస్తాడా? అని అంతా గుసగుసలాడుతున్నట్టుగా తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.