సీడెడ్ సత్తా పెరిగిపోతోంది!!

Update: 2017-05-25 05:48 GMT
టాలీవుడ్ సినిమాలకు ప్రధాన మార్కెట్లలో సీడెడ్ ఒకటి. నైజాం.. కోస్తాల తర్వాత స్థాయిలో సీడెడ్ ఉంటుంది. అంకలె పరంగా తక్కువ కనిపిస్తుంది కానీ.. విస్తీర్ణం పరంగా చూసుకుంటే.. ఇక్కడి కలెక్షన్స్ చాలా ఎక్కువ అనే చెప్పాలి. ఇప్పటివరకూ ఒక లెక్క అయితే.. ప్రస్తుతం సీడెడ్ నుంచి తెలుగు సినిమాలకు మేజర్ షేర్ అందుతోంది.

అల్లు అర్జున్ నటిస్తున్న దువ్వాడ జగన్నాధం మూవీ సీడెడ్ థియేట్రికల్ రైట్స్ కోసం 14 కోట్ల రూపాయలు చెల్లించారనే న్యూస్ సెన్సేషన్ అయింది. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రానికి ఏకంగా 7.2 కోట్ల మొత్తానికి సీడెడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందని అంటున్నారు. ఇది కేవలం బోయపాటి శ్రీనును చూసే అనడంలో సందేహం లేదు. ఈ రెండు ఫిగర్స్ ను చూసే టాలీవుడ్ ట్రేడ్ జనాలు ఆశ్చర్యపోతే.. ఇప్పుడు పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న చిత్రం ఏకంగా 18 కోట్లు పలుకుతోందనే న్యూస్ సెన్సేషన్ అవుతోంది.

సీడెడ్ నుంచి 18 కోట్ల మొత్తం డిస్ట్రిబ్యూటర్ కి దక్కాలంటే.. కనీసం 20 కోట్ల షేర్ అయినా రాబట్టాలి. టాలీవుడ్ లో ఇంతకు మించి వసూలు చేసిన సినిమాలు బాహుబలి 1 అండ్ 2. బాహుబలి తొలి భాగం 22 కోట్లు వసూలు చేస్తే.. రెండో భాగం 30 కోట్ల మార్క్ ను దాటేసింది. ఈ అంకెలు చూస్తుంటే.. సీడెడ్ నుంచి టాలీవుడ్ కి కంట్రిబ్యూషన్ ఏ స్థాయిలో పెరిగిందో అర్ధమవుతుంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News