చీప్‌ కామెడీకి టికెట్లు తెగడం లేదు

Update: 2019-10-21 10:07 GMT
ఓంకార్‌ దర్శకత్వంలో వచ్చిన రాజుగారి గది 3 కి నెగటివ్‌ టాక్‌ వస్తోంది. ఈ సిరీస్‌ లో వచ్చిన గత రెండు సినిమాల కారణంగా ఈ సినిమాపై అంచనాలు పెట్టుకున్నారు. ఓంకార్‌ విభిన్నమైన కాన్సెప్ట్‌ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడంటూ.. తప్పకుండా విజయాన్ని సాధిస్తుందంటూ యూనిట్‌ సభ్యులు ప్రచారం చేశారు. తీరా సినిమా విడుదలయ్యాక చూస్తే చాలా రొటీన్‌ గా ఉందని.. హర్రర్‌ సీన్స్‌ పాత చింతకాయ పచ్చడిలా ఉన్నాయంటూ కామెంట్స్‌ వస్తున్నాయి.

చీప్‌ కామెడీతో వసూళ్లు రాబట్టాలనుకున్న ఓంకార్‌ కు పెద్ద షాక్‌ ఇచ్చారు ప్రేక్షకులు. సినిమాకు వచ్చిన నెగటివ్‌ టాక్‌ కారణంగా.. చెత్త కామెడీ సీన్స్‌ అంటూ టాక్‌ వచ్చిన కారణంగా టికెట్లు తెగె పరిస్థితి కనిపించడం లేదు. ముఖ్యంగా ఓవర్సీస్‌ రైట్స్‌ కొనుగోలు చేసిన వారికి మాత్రం రక్త కన్నీరే అన్నట్లుగా ఉంది పరిస్థితి. విడుదలైన మొదటి మూడు రోజుల్లో రాజు గారి గది 3 చిత్రం అక్కడ కేవలం 3845 డాలర్లను మాత్రమే వసూళ్లు చేసింది. లక్ష డాలర్ల అంచనాతో సినిమాను బయ్యర్లు కొనుగోలు చేశారని వారికి ఈ సినిమాతో తీవ్ర నష్టాలు తప్పవంటూ ట్రేడ్‌ నిపుణులు చెబుతున్నారు.

అమెరికాలో రాజు గారి గది 3 కలెక్షన్స్‌ చూసి అంతా అవాక్కవుతున్నారు. దీంతో పాటు విడుదలైన మరో సినిమా ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌ కూడా అమెరికాలో తీవ్ర నిరాశను చవిచూసింది. అక్కడ మొదటి మూడు రోజుల్లో కేవలం 672 డాలర్లను మాత్రమే రాబట్టింది. అమెరికాలో ఇంకా కొన్ని స్క్రీన్స్‌ ల్లో సైరా ప్రదర్శితం అవుతూనే ఉంది. ఇప్పటి వరకు సైరా చిత్రం అక్కడ 2.6 మిలియన్‌ డాలర్లను రాబట్టింది.
Tags:    

Similar News