హీరో సినిమా ఒకటి హిట్టైందంటే ఆ తర్వాత వచ్చే సినిమాల బిజినెస్ పూర్తి గా మారి పోతుంది. రేట్లు ఓ రేంజిలో పలుకుతూంటాయి. ఆ హీరో సినిమా రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్స్, ఓటీటి సంస్దలు పోటీ పడుతూంటాయి. ఇప్పుడు రవితేజ తాజా చిత్రం 'ఖిలాడి' కు అదే జరుగుతున్నట్లు ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. మాస్ మహారాజ రవితేజ డ్యూయల్ రోల్ లో నటిస్తున్న 'ఖిలాడి' సినిమాకు ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వరస ఫ్లాఫ్ ల్లో ఉన్న రవితేజ సినిమా అంటే ఓ టైమ్ లో అందరూ భయపడిపోయారు. ఇంక ఆయన టైమ్ అయ్యిపోయిందని ప్రక్కకు వెళ్లిపోయారు. కానీ మొన్న సంక్రాంతికి రవితేజ 'క్రాక్' సినిమాతో భారీ హిట్ అందుకొని ఫుల్ ఫాంలోకి వచ్చేసాడు. దాంతో 'ఖిలాడి' మీద భారీ ఎక్సపెక్టేషన్స్ నెలకొన్నాయి. ఈ కారణంగానే అమెజాన్ వారు దాదాపు రూ. 45 కోట్ల వరకు ఆఫర్ ఇచ్చినట్లు చెప్తున్నారు. ఈ ఆఫర్ ను ఓకే చేసి,ఎగ్రిమెంట్ చేసుకున్నారా లేదా తెలియాల్సి ఉంది.
మరో ప్రక్క 'ఖిలాడి' సినిమా బడ్జెట్ పెరిగిందనే టాక్ ఫిల్మ్ సర్కిల్స్ లో వినిపిస్తోంది. దానికి కరోనా సెకండ్ వేవ్ కారణం అంటున్నారు. ఈ సినిమాకి సంబంధించిన 25రోజుల షెడ్యూల్ ఇటలీలో ప్లాన్ చేస్తే..కరోనా ఆంక్షలతో సగం షూటింగ్ అయ్యాక చిత్ర టీమ్ ఇండియాకి తిరిగి వచ్చేశారు. అయితే ఆ పదిహేను రోజులు జరిగిన షూటింగ్ కూడా సంతృప్తికరంగా మేకర్స్‌కి అనిపించకపోవడంతో మెత్తం షెడ్యూల్ మళ్ళీ ప్లాన్ చేసి రీషూట్ చేయాలని భావిస్తున్నారట. కొత్త షెడ్యూల్ కోసం మళ్ళీ బడ్జెట్ కేటాయించాల్సిన పరిస్దితి వచ్చింది.
దాంతో దాదాపు 10 కోట్ల వరకు బడ్జెట్ పెరిగినట్టు చెప్పుకుంటున్నారు. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నాడు. త్వరలో హైదరాబాద్ లో షూటింగ్ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారట. డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్ గా.. అనసూయ, అర్జున్ కీలక పాత్రలలో కనిపించబోతున్నారు. రాక్ స్టార్ దేవీశ్రి ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా ఈ నెల 28న రిలీజ్ కావాల్సిన 'ఖిలాడి' పోస్ట్‌పోన్ అయింది.