స్కైలో సాహో ప్రీరిలీజ్ బిజినెస్

Update: 2019-06-13 05:32 GMT
సాహో టీజ‌ర్ ఇంకాసేప‌ట్లో సునామీలా దూసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌భాస్ అభిమానుల్లో ఒక‌టే టెన్ష‌న్ టెన్ష‌న్. రోమాలు నిక్క‌బొడిచే టీజ‌ర్ ఫెస్ట్ కి రంగం సిద్ధ‌మైంది. ఈలోగానే ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ గురించి వేడెక్కించే చ‌ర్చ మొద‌లైంది. ముఖ్యంగా ట్రేడ్ కి ఎంతో ఇంపార్టెంట్ అని చెప్పే తూగో-ప‌.గో .. సీడెడ్ లో దుమ్ము దులిపేసింద‌ని తెలుస్తోంది.

సాహో రైట్స్ తూ.గో - ప‌.గో జిల్లాల‌కు 20 కోట్లు ప‌లికింద‌ట‌. ఆ మేర‌కు ప్ర‌ముఖ పంపిణీదారుడు రైట్స్ ని ఛేజిక్కించుకున్నార‌ని తెలుస్తోంది. అలాగే సీడెడ్ ఏరియాకు 25కోట్ల మేర బిజినెస్ పూర్త‌యింది. అలాగే క‌ర్నాట‌క రాష్ట్రం రిలీజ్ హ‌క్కుల కోసం ప్ర‌ముఖ నిర్మాత కం పంపిణీదారుడు 27కోట్లు వెచ్చించార‌న్న మాట వేడెక్కిస్తోంది. కేవ‌లం ఆంధ్ర‌ప్ర‌దేశ్ రైట్స్ రూపంలో యు.వి.క్రియేష‌న్స్ కి ఏకంగా 60కోట్లు ద‌క్కుతోంది. అంటే బాహుబ‌లి 50కోట్లను మించి బిజినెస్ పూర్త‌యింది. చాలా ఏరియాల్లో సాహో నాన్ బాహుబ‌లి రికార్డుల్ని తిర‌గ‌రాయ‌నుంద‌ని తెలుస్తోంది. ఇక ఇరు తెలుగు రాష్ట్రాల్లో 100 కోట్లు పైగా ప్రీరిలీజ్ బిజినెస్ చేస్తుండడం వేడెక్కిస్తోంది.

ఇక ఇప్ప‌టికే టీసిరీస్ భూష‌ణ్ కుమార్ హిందీలో సాహో చిత్రాన్ని రిలీజ్ చేస్తున్నారు. దాదాపు 80-90 కోట్ల మేర రైట్స్ కి చెల్లించ‌నున్నార‌ని అప్ప‌ట్లో ప్ర‌చార‌మైంది. సాహో ఓవ‌ర్సీస్ స‌హా నైజాం ఏరియా బిజినెస్ వివ‌రాలు పూర్తి క్లారిటీతో తెలియాల్సి ఉంది. ఇప్ప‌టికే చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌ని.. దిల్ రాజు స‌హా ప‌లువురు ప్ర‌ముఖ పంపిణీదారుల‌తో మంత‌నాలు సాగాయ‌ని ప్ర‌చార‌మైంది. అయితే పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.


Tags:    

Similar News