ఇక ప్రెజర్ మొత్తం బన్నీ మీదే..

Update: 2017-04-16 06:43 GMT
పోయినేడాది మెగా హీరోలకు బాగానే కలిసొచ్చింది. మెగా ఫ్యామిలీకి 100 పర్సంట్ సక్సెస్ రేట్ లేకపోయినప్పటికీ.. మెజారిటీ సినిమాలు బాగా ఆడాయి. సర్దార్ గబ్బర్ సింగ్.. తిక్క సినిమాల్ని మినహాయిస్తే అన్నీ మంచి ఫలితాలు అందుకున్నాయి. సమ్మర్లో వచ్చిన అల్లు అర్జున్ సినిమా ‘సరైనోడు’ బ్లాక్ బస్టర్ అయితే.. ఆ ఊపును కొనసాగిస్తూ సాయిధరమ్ తేజ్ ‘సుప్రీమ్’ సూపర్ హిట్టయింది. ఏడాది ఆఖర్లోకి వచ్చేసరికి ‘శ్రీరస్తు శుభమస్తు’ అల్లు శిరీష్ కు మంచి విజయాన్నందించింది. చివర్లో రామ్ చరణ్ ‘ధృవ’ కొసమెరుపు లాంటి విజయాన్నందుకుంది. ఈ ఏడాది మెగా హీరోల సినిమాలపైనా మంచి అంచనాలు నెలకొన్నాయి.

ఏడాది ఆరంభంలో ‘ఖైదీ నెంబర్ 150’ బ్లాక్ బస్టర్ హిట్టవడంతో మెగా హీరోలు హోరెత్తించేయడం ఖాయమని అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. కానీ ‘ఖైదీ’ ఊపు ఆ తర్వాత కొనసాగలేదు. ఫిబ్రవరిలో సాయిధరమ్ మూవీ ‘విన్నర్’ బోల్తా కొడితే.. తర్వాతి నెలలో ‘కాటమరాయుడు’ అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. తాజాగా వరుణ్ తేజ్ ‘మిస్టర్’ నెగెటివ్ టాక్ తో మొదలైంది. అల్లు శిరీష్ మలయాళంలో నటించిన ‘1971’ కూడా నిలబడలేదు. దీని తెలుగు వెర్షన్ పై ఆశల్లేవు. ఇప్పుడిక మెగా అభిమానుల దృష్టంతా అల్లు అర్జున్ ‘దువ్వాడ జగన్నాథం’ మీదే నిలిచింది. ఈ సినిమా సక్సెస్ కాకుంటే మెగా అభిమానులు నీరుగారిపోవడం ఖాయం. కాబట్టి ఇప్పుడు ప్రెజర్ మొత్తం బన్నీ మీదే నిలిచింది. మరి హరీష్ శంకర్ ఈ సినిమాను హిట్ చేసి మెగా అభిమానుల్లో ఉత్సాహం తీసుకొస్తాడేమో చూడాలి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News