అనౌన్స్ మెంట్ దశ నుంచే ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో సైతం అమితమైన ఆసక్తి రేపిన ఆర్ ఆర్ ఆర్ టైటిల్ గుట్టు ఇంకా వీడలేదు. ప్రస్తుతానికి ఇదే వాడుకుంటామని తర్వాత ఏది బాగుంటుందో ఆలోచించి ఫిక్స్ చేస్తామని రాజమౌళి ఆ మధ్య ప్రెస్ మీట్ లో చెప్పిన సంగతి తెలిసిందే. మీరే దాన్నికి తగ్గ టైటిల్ సూచించమని ఆర్ ఆర్ ఆర్ హింట్ ఇచ్చాడు. అంతే అభిమానులతో పాటు నెటిజెన్లు ఇందులో యమా ఉత్సాహంగా పాల్గొన్నారు.
వివిధ బాషలలో రకరకాల టైటిల్స్ ను సబ్జెక్టు కు సరిపోయే విధంగా వందల సంఖ్యలో పంపించారు. దీంతో ఆశ్చర్యపోయిన నిర్మాణ సంస్థ డివివి ఇంకా తడితే పంపించమని ఒకవేళ మీరు చెప్పిందే టైటిల్ కావొచ్చని ఊరిస్తూ సోషల్ మీడియాలో మరోసారి ప్రకటన ఇచ్చింది. అంతే కాదు ఇప్పటిదాకా వివిధ వర్గాల నుంచి టైటిల్స్ అన్నింటిని కూర్చి ఒక స్పెషల్ పోస్టర్ కూడా పోస్ట్ చేసింది. ఇంతకు ముందే ప్రచారంలోకి వచ్చిన రామ రావణ రాజ్యం రఘుపతి రాఘవ రాజారాంలతో పాటు ఎన్నో కొత్త టైటిల్స్ ఉన్నాయి.
తీక్షణంగా చూస్తే ఇందులో ఏదో ఒకటి ఫైనల్ అయినా ఆశ్చర్యం లేదు అనే రేంజ్ లో ఉన్నాయి. రిలీజ్ కు ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఆ లోపు ఇంకెన్ని వందల్లో టైటిల్స్ వస్తాయో చూడాలి. రామ్ చరణ్ గాయం వల్ల కొంత గ్యాప్ తీసుకున్న ఆర్ ఆర్ ఆర్ పూణే వెళ్ళడానికి ముందే హైదరాబాద్ లో కొంత భాగం షూటింగ్ చేయనుంది. వచ్చే ఏడాది జూలై 31న విడుదల కానున్న ఆర్ఆర్ఆర్ కు ఇంకా చాలా టైం ఉన్నప్పటికీ దాని మీద బజ్ మాత్రం మాటల్లో చెప్పే స్థాయి దాటిపోయింది