కల్కి కోసం రెండు కోట్ల రూపాయల సెట్!

Update: 2018-09-10 07:14 GMT
కెరీర్ లో స్లో అయిన సీనియర్ హీరో రాజశేఖర్ కు 'PSV గరుడవేగ' మంచి బూస్ట్ ఇచ్చింది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ ఫిలిం రాజశేఖర్ కు ఒక కంబ్యాక్ సినిమా అనుకోవచ్చు.  'గరుడవేగ' ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో రాజశేఖర్ రెట్టించిన ఉత్సాహంతో తన కొత్త సినిమా 'కల్కి' కోసం రెడీ అవుతున్నాడు.

'అ!' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా తెలంగాణా నేపథ్యంలో జరిగే కథ.  పీరియడ్ సినిమా అయిన 'కల్కి' 1980 ల కాలంలో జరుగుతుందట.  త్వరలో షూటింగ్ మొదలుకానున్న ఈ సినిమా కోసం రూ. 2 కోట్లతో హైదరాబాద్ లో ఒక భారీ సెట్ ను నిర్మిస్తున్నారట.  సినిమాలో మేజర్ పార్ట్ ఈ సెట్ లోనే చిత్రీకరిస్తారట.  ఇలాంటి పీరియడ్ సినిమాలకు సెట్స్ ఎంత ముఖ్యమో 'రంగస్థలం' సినిమా అందరికీ మరోసారి ఋజువు చేసింది.  దీంతో ప్రొడ్యూసర్స్ కూడా కథకు అవసరమైన సెట్స్ పై భారీగా ఖర్చుపెట్టేందుకు వెనకాడడం లేదు.

'కల్కి' సినిమాను CK ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై C.కళ్యాణ్ నిర్మిస్తున్నారు.  రాజశేఖర్ కూతుళ్ళు శివాని- శివాత్మిక కూడా హ్యాపీ మూవీస్ బ్యానర్ తో ఈ సినిమా నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నారు.  టాలీవుడ్ లో ఇప్పుడు పీరియడ్ సినిమాల ట్రెండ్ ఊపందుకుంది. మరి రాజశేఖర్ కు ఈ సినిమా ఆ ట్రెండ్ ను కొనసాగిస్తూ విజయాన్ని అందిస్తుందేమో వేచి చూడాలి.
Tags:    

Similar News