యువసామ్రాట్ నాగ చైతన్య - సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా దర్శకుడు శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ప్రేమకథా చిత్రం ''లవ్ స్టోరీ''. ఏప్రిల్ 16న విడుదల కావాల్సిన ఈ సినిమా కోవిడ్ నేపథ్యంలో వాయిదా పడింది. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ పాట కూడా విశేష స్పందన తెచ్చుకుంది. ముఖ్యంగా 'సారంగ దరియా' పాట యూట్యూబ్ ను షేక్ చేస్తూ సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఆదిత్య మ్యూజిక్ లేబుల్ ద్వారా రిలీజైన ఈ సాంగ్ కేవలం 32 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ మార్క్ అందుకొని, సౌత్ ఇండియాలో అతి తక్కువ టైంలో ఈ ఫీట్ అందుకున్న సాంగ్ గా నిలిచింది.
ఈ క్రమంలో 'సారంగ దరియా' పాట యూట్యూబ్ లో 15 కోట్లకు పైగా వ్యూస్ సాధించి తాజాగా 150 మిలియన్ల క్లబ్ లో జాయిన్ అయింది. తెలంగాణ జానపదం నేపథ్యంలో సాగిన ఈ పాట సంగీత ప్రియులను అలరిస్తూ 50 రోజుల్లోనే 150 మిలియన్లకు పైగా వ్యూస్ రాబట్టడం విశేషం. 'దాని కుడీ భుజం మీద కడవా.. దాని గుత్తెపు రైకలు మెరియా.. అది రమ్మంటె రాదురా సెలియా.. దాని పేరే సారంగ దరియా..' అంటూ సాగిన ఈ గీతానికి మ్యూజిక్ డైరెక్టర్ పవన్ సీహెచ్ అద్భుతమైన ట్యూన్ స్వరపరిచారు.
'కాళ్ళకు ఎండీ గజ్జెల్.. లేకున్నా నడిస్తే ఘల్ ఘల్.. కొప్పులో మల్లే దండల్.. లేకున్నా చెక్కిలి గిల్ గిల్.. నవ్వుల లేవుర ముత్యాల్.. అది నవ్వితే వస్తాయ్ మురిపాల్..' అంటూ ప్రముఖ రచయిత సుద్దాల అశోక్ తేజ అందించిన తెలంగాణ జానపద సాహిత్యం దీనికి అదనపు ఆకర్షణగా నిలిచింది. అలానే జానపద గాయని మంగ్లీ పాడిన తీరు శ్రోతలను విశేషంగా ఆకట్టుకుందని చెప్పవచ్చు. ఇందులో సాయి పల్లవి స్టెప్స్ వీక్షకులను అలరించాయి. ఇకపోతే 'సారంగ దరియా' పాటకు శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయగా.. విజయ్ సి.కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. 'లవ్ స్టోరీ' చిత్రాన్ని వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు అమిగోస్ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.