సీనియర్ స్టార్ హీరోల కుమారులు హీరోలుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఎవరికి వారు తమదైన ప్రత్యేకతను సంపాదించుకుంటూ ముందుకు వెళుతున్నారు. ఇక సీనియర్ స్టార్ హీరోల కుమార్తెల విషయానికి వస్తే, చాలామంది నిర్మాణ రంగం దిశగా వెళుతున్నారు. సూపర్ స్టార్ కృష్ణ కూతురు మంజుల నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత మోహన్ బాబు కూతురు మంచు లక్ష్మి కూడా కొన్ని సినిమాలకి నిర్మాతగా వ్యవహరించింది. ఇక చిరంజీవి కూతురు సుస్మిత కూగా ఈ మధ్యనే కొత్త బ్యానర్ ను ఏర్పాటు చేసుకుని నిర్మాణ రంగంలోకి ప్రవేశించింది.
సుస్మిత ఒక వైపున వెబ్ సిరీస్ లు .. మరో వైపున సినిమాలను నిర్మించాలనే ఉద్దేశంతో ముందుకు వెళుతోంది. ఇక అదే బాటలో రెబల్ స్టార్ కృష్ణంరాజు పెద్ద కూతురు ప్రసీద కూడా సినిమా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. 'రాధేశ్యామ్' సినిమాకి గోపీకృష్ణ మూవీస్ నుంచి ఆమె నిర్మాణ భాగస్వామిగా ఉన్నారు.
అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమైన ఈ సినిమా నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నిర్మాతగా ప్రసీద పేరు కూడా వెండితెరపై మెరిసింది. తాను నిర్మాతగా మారడానికి తన తండ్రితో పాటు తన సోదరుడు ప్రభాస్ కూడా కారణమని తాజా ఇంటర్వ్యూలో ఆమె చెప్పుకొచ్చింది.
ప్రసీద మాట్లాడుతూ .. మొదటి నుంచి కూడా సినిమా వాతావరణంలోనే పెరిగాను. నాన్న సినిమాకి సంబధించిన వ్యవహారాలను దగ్గరగా చూశాను. అందువల్లనే నాకు సినిమా నిర్మాణ రంగం వైపు వెళ్లాలని అనిపించింది. అయితే అవకాశం ఉంది కనుక అలాంటి ఆలోచన వచ్చిందా? లేదంటే నిజంగానే నాలో ఆ ప్యాషన్ ఉందా? అనేది తెలుసుకోవాలని అనిపించింది. అందుకోసం ముంబై వెళ్లి ఒక సినిమా ప్రొడక్షన్ హౌస్ లో పనిచేశాను. నేను ఎవరనేది .. నా నేపథ్యం ఏమిటనేది అక్కడ ఎవరికీ చెప్పలేదు. రోజుకి 18 గంటలపాటు పనిచేసేదానిని. అప్పుడు నాకు అర్థమైంది .. నాలో ఉన్నది ప్యాషన్ అని.
దాంతో నేను అమెరికా వెళ్లి అందుకు సంబంధించిన కోర్స్ చేశాను. కొంతాకాలం పాటు నెట్ ఫ్లిక్స్ లో పనిచేశాను. ఇక ఇప్పుడు గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ కి సంబంధించిన వ్యవహారాలు చూసుకుంటున్నాను. ఒక భారీ సినిమాతో .. అదీ అన్నయ్య సినిమాతో పరిచయం కావడం చాలా ఆనందంగా ఉంది.
నేను ఇంతవరకూ రావడానికి వెనుక మా అన్నయ్య ప్రోత్సాహం ఎంతో ఉంది. నాన్న .. అన్నయ్య ఉన్నారనే ధైర్యంతోనే ముందుకువెళ్లడం జరిగింది. కృష్ణంరాజు కూతురు .. ప్రభాస్ చెల్లెలు అనే గుర్తింపును గౌరవంగా .. గర్వంగా భావిస్తుంటాను. ప్రభాస్ కి ఇష్టమైన వంటకాలు .. కేక్ లు చేసి పంపుతుంటాను. నచ్చితే మళ్లీ పంపించమని అడుగుతూ ఉంటాడు" అని చెప్పుకొచ్చింది.