100 సెల్ఫీలు పడాల్సిందే

Update: 2017-09-09 00:30 GMT
ప్రస్తుత రోజుల్లో అరచేతిలో ప్రపంచాన్ని చూపించే విధంగా సెల్ ఫోన్ మనిషిలో ఒక భాగమై పోవడంతో ప్రతి ఒక్కరు శ్వసతో సమానంగా ఆ సెల్ ఫోన్ ను ఆస్వాదిస్తున్నారు. ఇక మనిషి ఆశగా చూసుకునే తన అందాన్ని సెల్ఫీ లో చూసుకుంటూ మరింత ఆనందపడుతున్నాడు. దానికి తోడు సోషల్ మీడియా జత కావడంతో ఇప్పుడు అది సెల్ఫీలకు అడ్డాగా మారిందా అనిపిస్తోంది.

అయితే ఈ సెల్ఫీ జబ్బు తారలకు కూడా బాగా ఎక్కేసింది. ఎక్కడికి వెళ్లినా సెల్ఫీ దిగుతూ వారి ఫ్యాన్స్ కోసం సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ పాపులారిటీని పెంచుకుంటున్నారు. ఇదే తరహాలో బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్  కూడా సెల్ఫీలకు తెగ పోజిస్తాడట. అయితే అందరిలాగా ఎదో 10 సెల్ఫీలతో సరిపెట్టుకోడట. ఒక్క రోజులో ఏకంగా 100 సెల్ఫీలు దిగుతానని చెప్పాడు. రీసెంట్ గా ఓ మొబైల్ ఆవిష్కరణలో పాల్గొన్న ఈ హీరో సెల్ఫీల గురించి కొన్ని ముచ్చట్లు చెప్పి అందరిని షాక్ కి గురి చేశాడు. రోజు ఎక్కడికి వెళ్లినా ఒక పది పదిహేను సెల్ఫీలు పడాల్సిందే అని చెబుతూ.. జిమ్ -పార్టీలు -వేడుకలు అని తేడా లేకుండా ఒక రోజులో 24 సెల్ఫీలు దిగుతా అన్నాడు.  ఒక్కోసారి మూడ్ బావుంటే వంద సెల్ఫీలు కూడా  దిగుతానని చెప్పి అందరిని ఔరా అనిపించాడు.

మొత్తానికి సెల్ఫీ పోటీల పెడితే రన్ వీర్ గట్టి పోటీనే ఇవ్వగలడు అంటున్నారు సినీ జనాలు. ఇక ఈ హీరో ప్రస్తుతం సంజయ్ లీలా భన్సాలి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న "పద్మావతి" అనే సినిమాలో నటిస్తున్నాడు. ఆ సినిమాలో దీపికా పదుకొనె మెయిన్ లీడ్ లో నటిస్తోంది. మరో పాత్రలో షాహిద్ కపూర్ స్క్రీన్ షేర్ చేసుకోనున్నాడు.
Tags:    

Similar News