యంగ్ హీరో తనీష్ టాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించి ఏకంగా 20 సంవత్సరాలైంది. అందులో 10 సంవత్సరాలు హీరో గా కొనసాగాడు. 1998లో బాలనటుడి గా కెరీర్ మొదలైంది. హీరో గా నటించిన నచ్చావులే 19 డిసెంబర్ 2008న రిలీజైంది. నాటి నుంచి అతడి కెరీర్ గెలుపోటములు, ఒడిదుడుకుల గురించి తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో తనకు ఏదీ కలిసిరాలేదు. వరుసగా అపజయాలు వస్తున్నాయి. ఇటీవలే రిలీజైన రంగు బావుందని టాక్ వచ్చినా జనాలకు చేరువ కాలేదు. అయితే తన కెరీర్ లో తప్పు ఒప్పులు, రిగ్రెట్స్ గురించి నేడు ప్రత్యేకంగా మీడియా ముందు తనీష్ మాట్లాడాడు. చేసిన తప్పులనుంచి బయటపడేందుకు ప్రయత్నిస్తున్నానని అన్నాడు. కొన్ని తప్పులు తాను చేయడం వల్లనే కెరీర్ లో ఇబ్బ ంది పడ్డానని అయితే మీడియా అండదండలతోనే తనకు ఇంత జర్నీ సాధ్యమైందని అన్నాడు. అయితే ఒకానొక సందర్భ ంలో తనను మీడియా తప్పుగా అర్థం చేసుకుని తప్పుగానే చూపించిందని అన్నాడు. అయినా లైఫ్ లో ఇవన్నీ భాగమేనని భావిస్తున్నానని ఇక పై తప్పులు చేయనని తనీష్ మారిన మనిషిగా కనిపించాడు.
అయితే తన తొలి సినిమా అనుభవాన్ని ఎంతో హృద్య ం అని తనీష్ చెప్పిన దానిని బట్టి అర్థమైంది. రవిబాబు దర్శకత్వ ం లో నచ్చావులే చిత్రం చేయడానికి ముందు తమ కుటుంబం ఆర్థికం గా ఎన్నో ఇబ్బ ందుల్లో ఉందని, తన తండ్రిగారు ఆర్మీ ఉద్యోగం వదిలి తన ప్రతిభను నమ్మి సినిమాల్లో ప్రోత్సహించారని తెలిపారు. నచ్చావులే ఆడిషన్స్ కోసం వెళ్లినప్పుడు చూద్దాంలే అని అన్నారే కానీ సెలెక్టెడ్ అని అనలేదు. పైగా బరువు తగ్గాలని చెప్పారు. అయితే అప్పటికే హీరోగా వేరొక సినిమాలో నటించే అవకాశం వచ్చినా ఆ స్క్రిప్టు అంతగా నచ్చలేదు. అయినా అవసరం చేయాల్సిన పరిస్థితి. ఈలోగానే తన తండ్రి రవిబాబు దర్శకత్వ ంలో అవకాశం కోసం ఆడిషన్స్ కి పంపించారు. అయితే రేపు ఓపెనింగుకి వచ్చెయ్ అని రవిబాబు తనను అనడానికి ముందు బరువు తగ్గడం కోసం ఎంతో శ్రమించానని, కేవలం 2 వారాల్లో 7 కేజీల బరువు తగ్గానని తనీష్ టాప్ సీక్రెట్ చెప్పాడు. తమ కుటుంబం కృష్ణానగర్ లోనే పది సంవత్సరాలు ఉంది. ఓ చిన్న ఇంటిలో అడ్జస్ట్ అయ్యి ఉండేవాళ్లమని తనీష్ చెప్పాడు.
17 వయసులో హీరో అయ్యాను. అప్పటికి ఏమీ తెలీదు. స్నేహితులు, పార్టీలు ఇదే లైఫ్ అనుకునేవాడిని. సక్సెస్ వచ్చింది అలా కెరీర్ వెళ్లిపోయింది. ఏది ఏం చేయాలో తెలీదు. ఎవరితో ఎలా ఉండాలో తెలీదు. రకరకాలు గా తప్పులు చేశాను. కానీ ఇక పై అలా చేయను. మీడియాతోనూ సన్నిహితంగా ఉంటాను.. అనీ తనీష్ రియలైజేషన్ గురించి చెప్పాడు. అయితే తనీష్ రియలైజ్ అయినా కాస్త ఆలస్యమైందనే చెప్పాలి. అయితే తనకు ఇంకో ఛాన్స్ ఉంది. హిట్టు ఒక్కటే ఇక్కడ నడిపిస్తుంది. ఆ హిట్టు కొట్టి మరింతగా కెరీర్ జర్నీ సాగించేందుకు ఆస్కారం ఉంది. మరి తదుపరి ఓ క్రేజీ చిత్రం లో నటిస్తున్నానని తెలిపాడు. బిగ్ బాస్ లో కనిపించడం వల్ల ప్రతి ఇంట్లో వాడిగా మారానని తనీష్ అన్నాడు. మారిన మనిషికి వెల్ కం. ఈ యువ హీరో ఎదగాలనే కోరుకుందాం.