బాలీవుడ్ లో ఖాన్ ల త్రయానికి ఎదురే లేదు. ఒక్కో సినిమాకి వంద కోట్ల పారితోషికం అందుకోవడం వీళ్లకు అలవాటు. అయితే వాణిజ్య ప్రకటనల ఆదాయం కూడా అసాధారణం. దీనికి తోడు ఈవెంట్లతోనూ సంపాదించడం వీళ్లకే చెల్లింది.
సల్మాన్ ఖాన్- షారుక్ ఖాన్ లు ఇండస్ట్రీలో పెద్ద స్టార్లుగా ఏలే రోజుల్లోనే ఈ తరహా ఆదాయాన్ని ఆర్జించారు. వారు ప్రపంచవ్యాప్తంగా ఘనమైన అభిమానులను కలిగి ఉన్నారు. డబ్బును అంతే అసాధారణంగా సంపాదిస్తారు.
అంతే కాకుండా ప్రైవేట్ పెళ్లిళ్లలో డ్యాన్స్ చేస్తే అంతే పెద్ద మొత్తంలో ఛార్జ్ చేస్తారు. కొన్ని వారాల క్రితం ఢిల్లీలో జరిగిన రిచ్ ఇండియన్ వెడ్డింగ్ లో స్టార్ హీరోలిద్దరూ సందడి చేశారు.
పెళ్లిలో డ్యాన్స్ చేయడానికి SRK మూడు కోట్లు.. సల్మాన్ 2 కోట్లు పారితోషికం తీసుకుంటారని ఇప్పుడు కథనాలొస్తున్నాయి. హృతిక్ కూడా 2 కోట్లు తీసుకుంటారు. రణవీర్ సింగ్- దీపికా- కత్రినా పెళ్లిలో డ్యాన్స్ చేయడానికి ఒక కోటి అందుకుంటారు.
ఇటీవల కిలాడీ అక్షయ్ కుమార్ - షారూక్ ఖాన్ - అజయ్ దేవగన్ విమల్ ఇలాచీ ప్రకటనలో నటించారు. దీనికోసం అత్యంత భారీగా పారితోషికం అందుకున్నారని తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రకటన లైవ్ లో ఉంది. కేవలం కొన్ని నిమిషాల యాడ్ కోసం ఒక రోజు షూట్ కోసమే కోట్లలో పారితోషికం అందుకున్నారు.