గానగంధర్వుడు ఎస్.పి. బాల సుబ్రమణ్యంతో మ్యాస్ట్రో ఇళయరాజా వివాదం గురించి తెలిసిందే. మ్యూజిక్ హక్కుల విషయంలో బాలుపై ఇళయరాజా ఎంతో క్లారిటీతో పోరాటం సాగించడంపై సర్వత్రా ఆసక్తికర చర్చ సాగింది. తాను స్వపరిచిన పాటలపై తనకు మాత్రం హక్కు- అధికారం ఉండాలన్న పంతంతో ఇళయరాజా తాను అనుకున్నది సాధించుకున్నారు. ఆ క్రమంలోనే ఎస్పీబీ సైతం రాయల్టీ విషయంలో తప్పేనంటూ సారీ చెప్పాల్సొచ్చింది. ఇకపోతే జూన్ 2న ఇళయరాజా 76వ పుట్టినరోజు సందర్భంగా తలపెట్టిన లైవ్ కాన్సెర్టులో పాల్గొని ఎస్పీబి బిగ్ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇద్దరు లెజెండ్స్ (ఇళయరాజా- ఎస్.పి బాలు) ఒకే వేదికపైకి రావడం అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా చేసింది. అరమరికలు లేకుండా ఇద్దరూ కలిసిపోయి అభిమానులకు ట్రీటిచ్చారు. ఇక కాన్సెర్టులో జేసు దాసు పాల్గొనడం ఆసక్తిని రేకెత్తించింది.
ఆ ఇద్దరూ రావడంతో ఆ లైవ్ కాన్సెర్ట్ గ్రాండ్ సక్సెసైంది. చెన్నయ్ ఈవీపీ ఫిలింసిటీలో జరిగిన ఈ కాన్సెర్టుకు జనం భారీగానే విచ్చేశారు. అయితే ఇదే వేదికపై ఓ సెక్యూరిటీ గార్డ్ చేసిన పనికి మ్యాస్ట్రో ఫైరవ్వడం అటుపై ఆయన తనకు పాదనమస్కారం చేసి నిష్క్రమించడం లైవ్ లో చూస్తున్న వారికి షాక్ నిచ్చింది. అయితే అతడు పాద నమస్కారం చేసి వెళ్లాక ప్రేక్షక మహాశయులకు రాజా క్లాస్ తీస్కున్నారు. అసలింతకీ ఏం జరిగింది? అన్నది పరిశీలిస్తే..
ఆ వేదికపై గాయనీగాయకులకు మంచి నీళ్ల బాటిల్స్ అందించేందుకు ఆ సెక్యూరిటీ గార్డ్ వేదిక ఎక్కేశాడు. దాంతో అనుమతి లేకుండా కార్యక్రమం మధ్యలో ఇలా వచ్చి డిస్ట్రబ్ చేస్తావా? అంటూ ఇళయరాజా ఆ గార్డ్ పై ఫైరయ్యారు. దాంతో అతడు చిన్నబుచ్చుకుని తనను క్షమించాల్సిందిగా కోరుతూ పాదనమస్కారం చేసి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అటుపై ఆడియెన్ వైపు దృష్టి సారించిన ఇళయరాజా .. రూ.10 వేలు అడ్వాన్స్ ఇచ్చి సీట్లు బుక్ చేసుకున్న వారి కుర్చీల్లో రూ.500, రూ.1000 టిక్కెట్స్ కొనుక్కున వారు ఎలా కూర్చున్నారు? అంటూ కాస్త తీవ్ర స్వరంతోనే తిట్టేశారు. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అసలే రాజాకు చాదస్తం పెరిగిపోయింది! అంటూ విమర్శిస్తున్న వాళ్లు ఉన్నారు. చిన్నబుచ్చుకునేంతగా ఆయన క్లాస్ తీస్కుంటుండడంతో సంగీత ప్రియులైన ఆడియెన్ లోనూ దీనిపై ఆసక్తికర చర్చ సాగింది. ఇళయరాజా సహనం కోల్పోవడం ఈ వీడియోలో కనిపిస్తోంది. ఇకపోతే ఈ వయసులో పెద్దాయన అంటే అందరికీ అపారమైన ప్రేమాభిమానాలు- గౌరవం ఉన్న సంగతి తెలిసిందే. మెలోడీ మ్యాస్ట్రోగా ఆయనకు ఉన్న గౌరవం ఎక్కడా చెక్కు చెదరలేదు. సినిమా బతికి ఉన్నంతకాలం మ్యాస్ట్రో కు ఈ గౌరవం దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
Full View