అడగ్గానే ఇంటర్వ్యూ ఇచ్చినందుకు నాకు మంచి శాస్తే చేశార్లెండి అంటూ అసహనం వ్యక్తం చేస్తోంది గోవా బ్యూటీ ఇలియానా. మీడియాతో ఎప్పుడూ చాలా ఫ్రెండ్లీగా ఉండే ఈ భామ.. ట్విట్టర్ వేదికగా జర్నలిస్టులందరినీ తిట్టిపోసింది. ఆమెతో ఈ మధ్య ఇంటర్వ్యూ చేసిన జర్నలిస్టు ఎవరో తన ఇష్టానుసారం రాసుకున్నాడట. తాను అనని మాటలన్నింటినీ అందులో పెట్టాడట. ఈ మాత్రం దానికి నన్నెందుకు ఇంటర్వ్యూ చేయడం.. మీరే ఏది పడితే అది రాసుకోవచ్చుగా అంటూ మండి పడింది ఇలియా.
తనను కొందరు 30 నిమిషాల ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూకు అడుగుతుంటారని.. కానీ చివరికి ఇంటర్వ్యూ ఇచ్చాక వాళ్లకు తోచింది రాస్తారని.. ఇలా అయితే తనను ఇంటర్వ్యూలు అడగడం దేనికని ప్రశ్నించింది ఇల్లీ. తన కుటుంబం ఒత్తిడి మేరకే తాను నటించాల్సి వస్తోందని చెప్పినట్లు ఇంటర్వ్యూలో రాశారని.. ఐతే తాను ఎక్కడా ఆ మాట అనలేదని.. తన కుటుంబం అలాంటి పరిస్థితిలో లేదని.. తనకు పూర్తి స్వేచ్ఛనిస్తుందని.. మద్దతుగా ఉంటుందని ఇలియానా చెప్పింది.
తన బాయ్ ఫ్రెండ్ ఆండ్రూతో తన బంధం గురించి కూడా లేని పోనివి రాశారని.. అతడితో తనకు నాలుగేళ్ల పరిచయం ఉందని ఇలియానా పేర్కొంది. తాను చెప్పింది ఒకటైతే.. మీడియావాళ్లు రాసింది మరొకటి అని ఇల్లీ ఆవేదన వ్యక్తం చేసింది. ఇంతకీ తనను ఇంటర్వ్యూ చేసి.. అలా ఇష్టానుసారం రాసుకున్న జర్నలిస్టు ఎవరో చెప్పకుండా మొత్తం మీడియా మీదే ఇలియానానిందలు వేసేయడమే బాలేదు.