న‌షాలానికి నిషా ఎక్కించ‌డంలో ఇల్లీ బేబీ త‌ర్వాతే

Update: 2020-08-17 10:50 GMT
న‌డుము ఒంపుల‌ను ఎర‌వేసి.. హుషారెత్తించే ఊప్స్ తో న‌షాలానికి నిషా ఎక్కించ‌డంలో ఇల్లీ బేబీ త‌ర్వాత‌నే. స‌న్న‌జాజి న‌డుముతోనే బోలెడంత‌ మాయాజాలం సృష్టిస్తుంది. అందుకు ఇదిగో ఇదే తాజా ప్రూఫ్. గోవా బ్యూటీ స్వ‌యంగా షేర్ చేసిన ఈ వీడియో అంత‌ర్జాలంలో సునామీ సృష్టిస్తోంది.

గుండె గుభేల్మ‌నిపించే న‌డుము ఒంపుల వీణ‌ల వీడియోని షేర్ చేసి వ‌దిలేసిందా? అంటే.. ఊహ‌కు రియాలిటీకి తేడా ఏంటో తెలుసా? అంటూ కుర్ర‌కారుకు ఫ‌జిల్ వేసింది. ఇంత‌కీ ఏమై ఉంటుంది ఆ తేడా? అదేదో నువ్వే చెప్పొచ్చుగా ఇల్లీ బేబీ? అంటూ యూత్ ప‌రేషాన్ అయిపోతున్నారు.

అన్న‌ట్టు ఈ రేంజులో మ‌త్తెక్కించే మాయాజాలం అభిషేక్ బ‌చ్చ‌న్ స‌ర‌స‌న చేస్తున్న తాజా మూవీ `ది బిగ్ బుల్` లో ఉంటుందా? అంటే ఏమో.. ప్చ్.. క్రైసిస్ లేక‌పోతే ఈపాటికే ఆ సినిమా రిలీజ్ కావాల్సింది. అన్న‌ట్టు ఆ సినిమాని నిర్మిస్తున్న పార్ట్ న‌ర్ ఎవ‌రో తెలుసా?  త‌న‌కు వ‌రుస‌గా అవ‌కాశాలిస్తూ .. బాలీవుడ్ లో బాగా ఎంక‌రేజ్ చేస్తూ ర‌క‌ర‌కాల గాసిప్పుల‌కు కార‌కుడ‌వుతున్న యాక్ష‌న్ గ‌న్ అజ‌య్ దేవ‌గ‌న్. ఇటీవ‌ల కాజోల్ సైతం ఆ మ్యాట‌ర్ లో భ‌ర్త‌పై గుర్రుమంద‌ట‌.
Tags:    

Similar News