చాలా మంది హీరోయిన్స్ తెలుగులో మొదటి ఛాన్స్ కొట్టేస్తే చాలు బాలీవుడ్ లో ఎప్పుడో ఒకప్పుడు ఛాన్స్ ని పట్టేసినట్లే అని అనుకుంటారని ఓ రూమర్ ఉంది. అయితే అప్పుడప్పుడు ఈ రూమర్ నిజమే అనిపిస్తుంది. ఎందుకంటే టాలీవుడ్ లో దేవదాసు లాంటి లవ్ స్టోరితో హిట్ కొట్టేసి కొన్నేళ్ల తర్వాత బాలీవుడ్ లో మకాం వేసిన భామ ఇలియానా. పోకిరి హిట్ తర్వాత ఈ గోవా బ్యూటీ చాలా ఫేమస్ అయ్యింది. బాలివుడ్ కి వెళ్లిన తర్వాత కూడా టాలీవుడ్ లో అప్పుడప్పుడు సినిమాలను చేస్తూ.. కాస్త తెలుగు అభిమానులకు టచ్ లో ఉంటుంది.
అయితే ప్రస్తుతం ఈ అమ్మడు బాలీవుడ్ సినిమాలకు ఎక్కువ అలవాటుపడిపోయింది. కాకపోతే హిట్లే లేవు. అంతే కాకుండా గత కొన్నేళ్లుగా ఆస్ట్రేలియన్ ఫొటో గ్రాఫర్ తో ప్రేమయనాన్ని కొనసాగిస్తూ.. సోషల్ మీడియాలో ఫొటోలని పోస్ట్ చేస్తూ తెగ హల్ చల్ చేస్తోంది. అయితే రీసెంట్ గా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఇలియానా తన బాయ్ ఫ్రెండ్ అయిన ఆండ్ర్యూ నీబోన్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది.
ఆమె మాట్లాడుతూ..ఆండ్ర్యూ నీబోన్ ఏ విషయంలో అయినా ప్రైవసీ గా ఉంటేనే ఇష్టపడతాడు. అయితే ఈ సినిమా ఫీల్డ్ లో నేను 11 ఏళ్లుగా అన్ని రకాల ఇబ్బందుల్ని ఎదుర్కొన్నాను. ఎన్నో సినిమాల్లో చేసాను. ఒక నటిగా సంతృప్తినిచ్చిన పాత్రలు కూడా చేశాను. అయితే ఒక్కోసారి ఏ తప్పు చేయకున్నా అనవసరంగా చేదు అనుభవాలను ఇక్కడ ఎదుర్కోవాలి. దీంతో నాతో పాటు ఉన్న వాళ్ళు కూడా ఒక్కోసారి ఆ ఇబ్బందులకు బాధపడవచ్చు అందుకే నా వల్ల ఆండ్ర్యూ నీబోన్ కి అవన్నీ రాకూడదని అనుకుంటాను. అతను కూడా ఏ విషయాన్ని బహిర్గతం చేయడానికి అంతగా ఇష్టపడడు. అదే విధంగా ఆండ్ర్యూ ని కొందరు ఇండియాకి చెందిన వాడు కాదు అంటారు. అలా అనడం సరికాదు. అతనంటే నాకెంతో ఇష్టం అంటూ.. తన కుటుంబాన్ని ఎవరైనా వేలెత్తి చూపించే పరిస్థితి రాకుండా చూసుకుంటానని చెప్పింది ఇలియానా.
ఇక తన పెళ్లి ప్రస్తావన రాగానే ఈ అమ్మడు.. అప్పుడే పెళ్ళెంటి ఈ సహజీవనంతో మేము చాలా ఆనందంగా ఉన్నాము అంటూ.. పెళ్లికి ఆ రిలేషన్ కి చాలా తేడా ఉందని చెప్పుకొచ్చింది. మరి అంతగా తన బాయ్ ఫ్రెండ్ ని ఇష్టపడే ఈ భామ పెళ్లి అనే దగ్గరి బంధాన్ని ఎందుకు దూరంగా పెడుతుందో అమెకే తెలియాలి.