బాలీవుడ్ హీరోయిన్ కృతిసనన్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం 'మిమి'. సరోగసి ద్వారా బిడ్డను కని, వేరే దంపతులకు ఇచ్చే యువతి కథే ఈ చిత్రం. ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ చిత్రం.. ప్రశంసలు అందుకుంటోంది. అయితే.. ఈ మూవీ కాన్సెప్ట్ తో మన తెలుగులో ఎప్పుడో ఎనిమిదేళ్ల కిందటే సినిమా నిర్మించారు. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఈ మూవీ 'వెల్కమ్ ఒబామా' పేరుతో రిలీజ్ అయ్యింది.
అయితే.. ఈ మూవీ స్ట్రయిట్ టాలీవుడ్ చిత్రం కాదు. మన దగ్గర రీమేక్ అయ్యింది! మరాఠా లాంగ్వేజ్ లో 2011లో ఈ చిత్రం పురుడు పోసుకుంది. 'మలా వాయ్ వహ్ చే' టైటిల్ తో రిలీజ్ అయిన మూవీ స్థానికంగా మంచి విజయం సాధించింది. సరికొత్త కథాంశంతో వచ్చిన ఈ సినిమా చాలా మందిని ఆకర్షించింది. దీంతో.. తెలుగులో సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో 'వెల్కమ్ ఒబామా' పేరుతో 2013లో రీమేక్ చేశారు.
మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఈ తరహా చిత్రాన్ని బాలీవుడ్ లో తెరకెక్కించారు. అయితే.. ఇందులో కీలకమైన మార్పు ఏమంటే.. ఎమోషనల్ సినిమాకు కామెడీ టచ్ ఇవ్వడం! తొలి అర్థభాగం హాస్యంతో సాగిపోయే ఈ సినిమా.. ఆ తర్వాత సీరియస్ టర్న్ తీసుకొని, భావోద్వేగంతో సాగిపోతుంది. చివరకు వరకు ఇదే టెంపో కొనసాగించి, ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు దర్శకుడు.
అయితే.. మిమి చిత్రం ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించిన ఒబామా మూవీ మాత్రం సరిగా ఆడలేదు. దీనికి ప్రధాన కారణం.. అందులోని నటీనటులు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేకపోవడం ప్రధాన కారణం. అదే సమయంలో మొత్తం సీరియస్ మోడ్ లో సాగిపోవడం కూడా మరో రీజన్. మిమిలో మాత్రం కృతిసనన్ వంటి స్టార్ ను పెట్టడం, కథనంలో మార్పులు చేయడం కలిసొచ్చాయి.