ఇన్ స్టాతో సినిమాల్ని మించిన ఆదాయం!

Update: 2022-11-26 14:30 GMT
సెల‌బ్రిటీల ఇన్ స్టా ఖాతాలకున్న ఫాలోయింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.  హీరోల సంగ‌తి ప‌క్క‌న‌బెట్టి హీరోయిన్ల గురించి మాట్లాడుకుంటే  ఇన్ స్టాలో క్రేజీ బ్యూటీలుగా దూసుకుపోతున్నారు. ల‌క్ష‌ల్లో ఫాలోవ‌ర్స్ ని పోగేసుకుని ఎండార్స్ చేస్తూ రెండు చేతులా సంపాద‌నే.

ఇన్ స్టా ఖాతా బ్యూటీల‌కు పార్ట్ టైమ్ ఉద్యోగంలా నిలుస్తుంది. ఇంకా చెప్పాలంటే సినిమాల్నిమించిన ఆదాయం ఇక్క‌డ క‌నిపిస్తుంది. ఒక్కో పోస్ట్ కు ల‌క్ష‌ల్లో జుర్రేస్తున్నారు. మ‌రి ఆ వ‌రుస‌లో ముందు వ‌రుసులో ఉన్న టాలీవుడ్ భామ‌లెవ‌రో ఓసారి చూసేద్దామా..

చంద‌మామ కాజ‌ల్ అగ‌ర్వాల్ 24.1 మిలియ‌న్ ఫాలోవర్స్ ని క‌ల్గి ఉంది. ఈభామ ఇన్ స్టాలో ఒక్క పోస్ట్ పెట్ట‌డానికి 30 ల‌క్ష‌ల‌కు ఛార్జ్ చేస్తుందిట‌. ఎలాంటి ప్ర‌మోష‌న్ అయినా స‌రే ఆమౌంట్ ఖాతాలో జ‌మ అయితే సరి!  ఠ‌కీ మ‌ని పోస్ట్ అమ్మ‌డి ఖాతాలో ప‌డిపోతుంది. నెట్టింట వైర‌ల్ అవుతుంది. అలాగే 22.6  మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ తో ర‌కుల్  ప్రీత్ సింగ్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతుంది.

ఈ భామ ఒక్క పోస్ట్ కు 30 నుంచి 40 ల‌క్ష‌ల మ‌ధ్య‌లో ఛార్జ్ చేస్తోందిట‌. అది కంపెనీని బ‌ట్టి ఛార్జ్ నిర్ణయిస్తుందిట‌. త‌న వ‌ద్ద‌కు వ‌చ్చిన ఏ బ్రాండ్ ని వ‌ద‌ల‌డం లేదుట‌. వ‌చ్చిన కాడికి క్రేజ్ తో  పిండేస్తుందిట‌. ఇక నేష‌న‌ల్ క్ర‌ష్ బ్యూటీ ర‌ష్మిక మంద‌న్న 35.3 మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్స్ తో  టాప్ లో కొన‌సాగుతుంది. ఈ భామ ఒక్కో ప్ర‌మోష‌న‌ల్ పోస్ట్ కి అక్ష‌రాలా 50లక్ష‌లు డిమాండ్ చేస్తోందిట‌.

అందులో ఒక్క రూపాయి కూడా మిన‌హాయింపు ఇవ్వ‌డం లేదుట‌. ఈ బ్యూటీ కూడా ఇన్స్టాలో చాలా యాడ్స్ ప్ర‌మోట్ చేస్తుంటారు. బాలీవుడ్ కి వెళ్లిన త‌ర్వాత రెట్టింపు క్రేజ్ తో దూసుకుపోతుంది. ఎలాంటి ప్ర‌క‌ట‌న‌ని విడిచి పెట్ట‌డం లేదు. అందిన వ‌ర‌కూ జుర్రేస్తుందిట‌. అలాగే బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే కి21.9 మిలియ‌న్ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఈబ్యూటీ ల‌క్ష‌ల్లోనే ఆర్జిస్తుంద‌ని స‌మాచారం.

ఇక స‌మంత ఇన్ స్టా ఖాతాకి 24 ల‌క్ష‌ల మంది ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ఈమె ఒక్కో పోస్ట్ కి  20 ల‌క్ష‌ల వ‌ర‌కూ ఛార్జ్ చేస్తోందిట‌. అలాగే జెనిలియా  కూడా సింగిల్ పోస్ట్ కి 40లక్ష‌ల వ‌ర‌కూ డిమాండ్ చేస్తోందిట‌. సినిమాలు పెద్ద‌గా చేయ‌క‌పోయినా ఇన్ స్టా క్రేజ్ తోనే ఇదంతా సాధ్యం చేస్తుంది. ఇంకా చాలా మంది హీరోయిన్లు ఇదే బాట‌లో ఇన్ స్టా  ఫాలోయింగ్ ని స‌ద్వినియోగం చేసుకుంటున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News