పాక్‌ లో ఇండియన్‌ సినిమాల బ్యాన్‌?

Update: 2019-02-22 17:01 GMT
ఇండియా - పాకిస్తాన్‌ దేశాల మద్య సంబంధాలు పుల్వామా ఉగ్రదాడి తర్వాత మరింతగా దెబ్బ తిన్నాయి. పాకిస్తాన్‌ ప్రభుత్వం పెంచి పోషిస్తున్న ఉగ్రవాద సంస్థలు ఎంతో మంది జవాన్‌ లను మట్టుబెడుతున్న నేపథ్యంలో పాకిస్తాన్‌ తో తెగ తెంపులు చేసుకోవాలని భారత్‌ నిర్ణయించింది. ఈ సమయంలోనే పుల్వామా ఉగ్ర దాడి తర్వాత ఇండియన్‌ సినిమాల్లో పాకిస్తాన్‌ టెక్నీషియన్స్‌ కాని, నటీనటులను కాని ఉపయోగించవద్దని ఆల్‌ ఇండియా ఫిల్మ్‌ ఫెడరేషన్‌ నిర్ణయం తీసుకుంది.

ఇండియన్‌ సినిమాలో పాకిస్తాన్‌ వారిని బ్యాన్‌ చేసిన నేపథ్యంలో పాకిస్తాన్‌ లో ఇండియన్‌ సినిమాలను విడుదల కానివ్వొద్దు అంటూ లాహోర్‌ హైకోర్టు ను ఒక వ్యక్తి ఆశ్రయించాడు. భారత దేశంలో పాకిస్తాన్‌ కళాకారులను బహిష్కరించిన నేపథ్యంలో వారి సినిమాలను పాకిస్తాన్‌ లో ఎందుకు ప్రదర్శించాలంటూ ఆయన పిటీషన్‌ దాఖలు చేశాడు. పాకిస్తాన్‌ టీవీ ఛానెల్స్‌ లో ఇండియన్‌ కంటెంట్‌ మరియు పాకిస్తాన్‌ లో ఇండియన్‌ ఛానెల్స్‌ ను బ్యాన్‌ చేయడంతో పాటు, ఇండియన్‌ సినిమాలను బ్యాన్‌ చేయాలని ఆ వ్యక్తి కోరుతున్నాడు.

ఆ వ్యక్తి హైకోర్టులో పిటీషన్‌ వేయక ముందే పుల్వామా ఉగ్రదాడి జరిగిన రెండవ రోజే పలువురు హిందీ హీరోలు తమ సినిమాలను పాకిస్తాన్‌ లో విడుదల చేయబోం అంటూ ప్రకటించారు. మేమే మీ మార్కెట్‌ వద్దనుకుంటూ ఉంటే మీరు మమ్ముల్ని బ్యాన్‌ చేసేది ఏంటీ అంటూ కొందరు ఇండియన్‌ సినీ పరిశ్రమకు చెందిన వారు సోషల్‌ మీడియా ద్వారా ఘాటుగా స్పందిస్తున్నారు.
Tags:    

Similar News