మాధవన్ స్థానంలో ఆ బాలీవుడ్ హీరో!

Update: 2019-06-08 17:21 GMT
గతంలో బుల్లి తెర వెండి తెర అని మాత్రమే ఉండేవి.  కానీ ఇప్పుడు ఇంటర్నెట్ విప్లవం.. డిజిటల్ స్ట్రీమింగ్ టెక్నాలజీ పాపులర్ కావడంతో ఎంటర్టైన్మెంట్ రంగంలో చాలా మార్పులు వచ్చాయి.  వెబ్ సీరీస్ అనేవి పాపులర్ అయ్యాయి.  తెలుగులో ఇంకా ఈ ట్రెండ్ ఊపందుకోలేదు కానీ హిందీలో మాత్రం మహా జోరుగా కొనసాగుతోంది. మెయిన్ స్ట్రీమ్ బాలీవుడ్ యాక్టర్స్ వెబ్ సీరీస్ లో నటించేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.  సైఫ్ అలీ ఖాన్ లాంటి హీరోలు ఇప్పటికే ఈ వెబ్ సీరీస్ లో ఎంట్రీ ఇచ్చారు. అలానే ఆర్. మాధవన్ నటించిన 'బ్రీథ్' సీరీస్ కూడా ఎంతో ఆదరణ దక్కించుకుంది.  

'బ్రీథ్' లో కొడుకు కోసం అవయవదాతలు అవసరమై హత్యలు చేసే వ్యక్తి పాత్రలో మాధవన్ నటించి అందరికీ షాక్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే ఈ వెబ్ సీరీస్ కు సెకండ్ సీజన్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.  సెకండ్ సీజన్ అనగానే మొదటి సీజన్ లో ఉండే స్టొరీ.. థీమ్ కంటిన్యూ అవుతుందని అనుకుంటారేమో కానీ అలా కాదట.  ఈ సీజన్ కోసం కొత్త నేపథ్యం తీసుకున్నారట. దాదాపుగా 90% షూటింగ్ పూర్తి చేసుకున్న సెకండ్ సీజన్ లో మాధవన్ నటించడం లేదు.  మాధవన్ స్థానంలో అభిషేక్ బచ్చన్ నటిస్తున్నాడు.  అభిషేక్ తో పాటుగా 'రేయ్' హీరోయిన్ సయామీ ఖేర్ ఈ వెబ్ సీరీస్ లో మరో ప్రధాన పాత్ర పోషిస్తోంది.  టాలెంటెడ్ హీరోయిన్ నిత్యా మీనన్ ఇందులో ఒక కీలక పాత్రలో నటిస్తోంది.

అభిషేక్ బాలీవుడ్ లో హీరోగా చాలా సినిమాల్లో నటించాడు కానీ ఇలా నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించడం మొదటిసారి. మరి సెకండ్ సీజన్ లో మాధవన్ ను మైమరిపించేలా నటించి అందరినీ ఆకట్టుకుంటాడో లేదో వేచి చూడాలి.  ఈ వెబ్ సీరీస్ అమెజాన్ ప్రైమ్ లో ప్రసారం అవుతుంది.

    
    
    

Tags:    

Similar News