`టైటానిక్`... 1997లో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ సినిమాని ఏ స్థాయిలో ప్రభావితం చేసిందో అందరికి తెలిసిందే. ఆ అద్భుత చిత్రానికి సృష్టికర్త జేమ్స్ కామెరాన్. ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచిన ఆయన సృష్టించిన మరో అద్భుతం `అవతార్`.
2009లో వచ్చిన ఈ చిత్రం ప్రపంచ సినిమాని ఆశ్చర్యపడేలా చేసి సరికొత్త చరిత్రని సృష్టించింది. ప్రపంచ సినీ చరిత్రలో సువర్ణాధ్యాయానికి తెరలేపిన ఈ చిత్రానికి ప్రస్తుతం జేమ్స్ కెమెరాన్ సీక్వెల్స్ ని సిద్ధం చేస్తున్నారు.
మొత్తం నాలగు సీక్వెల్ లని సరికొత్త నేపథ్యంలో రూపొందిస్తున్న కామెరున్ `అవతార్ -2`ని వచ్చే ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ సినిమా కోసం ప్రపంచ వ్యాప్తంగా వున్న సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
`అవతార్`తో పండోరా అనే అద్భుతలోకాన్ని అవిష్కరించి అబ్బురపరిచిన కామెరున్ పార్ట్ 2 కోసం మరే అద్భుతాన్ని సృష్టించబోతున్నారా అని అంతా ఎదురుచూస్తున్నారు. కామెరున్ `అవతార్` సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు. ఈ సినిమా సాధించిన వసూళ్లని ఇంత వరకు ఏ చిత్రం క్రాస్ చేయలేకపోయింద.
`అవతార్` సాధించిన వసూళ్లు 20 వేల 368 కోట్లు.ఈ రికార్డుని మళ్లీ తిరగరాయాలంటే అది కజేమ్స్ కెమెరాన్ `అవతార్ -2`కే సాధ్యం. ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికరమైన అంశాలు బయటికి వచ్చాయి.
ఈ చిత్రాన్ని దాదాపు 1900 కోట్ల భారీ బడ్జెట్ తో వరల్డ్ లోనే కనీ వినీ ఎరుగని స్థాయిలో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. గత కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో వుంది.
`అవతార్` పండోరా గ్రహం నేపథ్యంలో విజువల్ వండర్‌గా తెరకెక్కించి సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన జేమ్స్ కెమెరాన్ సీక్వెల్ `అవతార్ -2` ని అండర్ వాటర్ నేపథ్యంలో రూపొందిస్తుండటం విశేషం.
ఆ కారణంగానే ఈ మూవీ చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. ఎట్టకేలకు పూర్తయింది.వచ్చే ఏడాది డిసెంబర్ 16న ఈ విజువల్ వండర్ ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీ తరువాత పార్ట్ 3ని 2024లో .. పార్ట 4 ని 2026లో.. పార్ట్ 5 ని 2028లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారట.
ఇప్పటికే పార్ట్ 2తో పాటు పార్ట్ 3 షూటింగ్ పూర్తయినట్టుగా తెలిసింది. ప్రతీ పార్ట్ కి 1900 కోట్లు ఖర్చు చేస్తున్నారట. అంటే మొత్తం నాలుగు సీక్వెల్స్ కి 11,300 కోట్లు బడ్జెట్ ని ఖర్చు చేస్తున్నట్టుగా హాలీవుడ్ వర్గాల సమాచారం. ఈ స్థాయిలో సీక్వెల్ చిత్రాలు ఖర్చు చేయడం ప్రపంచ సినీ చరిత్రలోనే అరుదైన రికార్డుగా నిలిచిపోనుందని చెబుతున్నారు.