వెబ్ సిరీస్ లు సినిమాలేనా ధ‌నాధ‌న్ దోనీ టార్గెట్

Update: 2020-10-07 01:30 GMT
మహేంద్ర సింగ్ ధోని పదవీ విరమణ వార్త ఈ సంవత్సరం ఆరంభంలో అందరినీ కన్నీటిపర్యంతం చేసింది. కానీ ధ‌నాధ‌న్ దోనీ తన జీవితం ఎలా ఉండాలి? అన్న‌దానిని చాలా ముందే ప్లాన్ చేసుకున్నాడు. ధోని తన భార్య సాక్షి తో కలిసి ఇప్ప‌టికిప్పుడు 6 ప్రాజెక్టులతో పూర్తి బిజీగా ఉన్నాడు. ఇందులో కొన్ని ప్రీవ‌ర్క్ కూడా మొద‌లైపోయాయి.

త‌దుప‌రి వెబ్ సిరీస్ లు సినిమాలు అంటూ దోనీ ప్లానింగ్ సాగుతోంది. ఆరు ప్రాజెక్టులలో ఒకటి ఇంకా విడుదల కాని ఓ పుస్తకం ఆధారంగా రూపొందే వెబ్ సినిమా అని ఓ ఇంటర్వ్యూలో సాక్షి తెలిపారు. ``మేము ఓ డెబ్యూ రచయిత ప్రచురించని పుస్తకం హక్కులను సంపాదించాం. దానిని వెబ్ సిరీస్ గా మార్చుకుంటాము. ఇది ఒక సీక్రెట్ అఘోరా జ‌ర్నీలో అన్వేష‌ణ‌కు సంబంధించిన క‌థాంశం. ఒక పౌరాణిక సైన్స్ ఫిక్షన్ కథ. మారుమూల ద్వీపంలో హైటెక్ సౌకర్యం నేప‌థ్యంలో క‌థాంశం ఆస‌క్తిని రేకెత్తిస్తుంది...`` అని తెలిపారు.

ధోని తొలి వెబ్ సిరీస్ వాస్తవానికి అక్షత్ గుప్తా రాసిన `ది హిడెన్ హిందూ` అనే పుస్తకం నుండి క‌థ‌ను సిద్ధం చేస్తున‌నారు. భారీ స్థాయిలో తెర‌కెక్కించే ప్లాన్ తో ఉన్నారు. భారతదేశంలోనే అత్యంత కాస్ట్ లీ వెబ్ సిరీస్ కూడా కావచ్చు. సత్యూగ్ ‌లో జన్మించిన ఒక అఘోరి పాత్ర చుట్టూ తిరిగే కొన్ని పాత్ర‌ల సంఘ‌ర్ష‌ణ‌కు సంబంధించిన సిరీస్ ఇది. సజీవంగా అఘోరాని క‌ళ్ల‌కు క‌న‌బ‌డేలా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చేవిధంగా సిరీస్ ని తెర‌కెక్కిస్తార‌ట‌. సాక్షి ధోని ఈ పుస్తకాన్ని ఇష్టపడ్డారు. ప్రస్తుతం డిజిటల్ అనుసరణ కోసం స్క్రిప్ట్ ‌ను సిద్ధం చేస్తున్నారు.
Tags:    

Similar News