రాజ్ కుంద్రా అర‌ణ్యంలోకి లేదా విదేశాల‌కు?

Update: 2021-11-03 04:52 GMT
రాజ్ కుంద్రా తన సోషల్ మీడియా ఖాతాలను శాశ్వ‌తంగా తొలగించిన కొద్దిసేపటికే ఆయ‌న స‌తీమ‌ణి శిల్పా శెట్టి ఇన్ స్టాగ్రామ్ లో అభిమానుల‌కు ట‌చ్ లోకి వ‌చ్చారు. అంతేకాదు ఒక పాపుల‌ర్ పుస్తకానికి సంబంధించిన‌ సారాంశాన్ని పంచుకుంటూ వేదాలు వ‌ల్లించ‌డం ఇప్పుడు స‌ర్వ‌త్రా హాట్ టాపిక్ గా మారింది.

శిల్పాశెట్టి ఇన్ స్టా స్టోరీస్ లో `ఆట‌విక అంత‌ర్ దృష్టి`పై ఒక పుస్తకం నుండి సారాంశాన్ని షేర్ చేశారు. ఆమె భర్త రాజ్ కుంద్రా తన ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్ ఖాతాలను తొలగించిన కొద్దిసేపటికే ఆమె నుంచి ఈ నోట్ వచ్చింది. ఎక్సెర్ప్ట్ అలాన్ ఆల్డా కోట్ తో ఇది మొదలవుతుంది. “మీరు మీ సౌకర్యవంతమైన నగరాన్ని విడిచిపెట్టి.. మీ అంతర్ దృష్టి అనే అరణ్యంలోకి వెళ్లాలి. అక్క‌డ‌ మీరు కనుగొనేది అద్భుతంగా ఉంటుంది. మీరు కనుగొనేది మిమ్మ‌ల్నే`` అంటూ కోట్ సారాంశాన్ని తెలిపారు.

ఈ పుస్తకం ఒకరి కంఫర్ట్ జోన్ నుండి బయటపడవలసిన అవసరం గురించి మాట్లాడుతుంది. మ‌నం సౌకర్యం వైపు ఆకర్షితులవుతున్నాం. మన జీవితాల గురించి మనకు కొన్ని ఫిర్యాదులు ఉండొచ్చు. గ‌డిచిన విషయాలు సరైనవి కావు కానీ.. మ‌నం ఎలాంటి వార‌మో.. ఎక్కడికి వెళ్తున్నామో (ఎక్కువ లేదా తక్కువ) మ‌న‌కు తెలుసు. మేము గ‌డిచిన‌ దాని గురించి ఓకేగా భావిస్తున్నాం. మనం మన కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది? మ‌రో దేశంలో ఒక సంవత్సరం గడపడం వల్ల ప్ర‌పంచాన్ని చాలా భిన్నంగా చూడవచ్చు. ఒక గొప్ప నష్టం-లేదా ఏదైనా పెద్ద మార్పు-మనం ఎన్నడూ ఊహించని ప్రదేశానికి మనల్ని నెట్టివేస్తుంది`` అని సుదీర్ఘ పాఠాన్ని వివ‌రించారు శిల్పాజీ. “నేను నా కంఫర్ట్ జోన్ నుండి బయటపడి ఏం జరుగుతుందో చూడాలి. మార్పుతో పోరాడే బదులు.. నేను దానిని స్వీకరిస్తాను ” అని పాఠాన్ని ముగించింది.

శిల్పాశెట్టి ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ లో పుస్తక సారాంశాన్ని పంచుకున్నారు.

సోమవారం నాడే రాజ్ సోషల్ మీడియాల నుంచి వైదొల‌గార‌ని నెటిజ‌నుల‌ దృష్టికి వచ్చింది. జూలైలో పోర్న్ సంబంధిత కేసులో అరెస్టయినప్పటి నుంచి అతను ట్విట్టర్ - ఇన్ స్టాగ్రామ్ లో యాక్టివ్ గా లేనే లేడు. అడల్ట్ వీడియోల నిర్మాణం .. స్ట్రీమింగ్ లో అతను పాల్గొన్నాడనే తీవ్ర‌మైన‌ ఆరోప‌ణ‌ల‌తో అరెస్ట‌య్యారు. ఇండియన్ పీనల్ కోడ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్ర‌కారం మహిళల ప‌ట్ల అస‌భ్య‌క‌ర వీడియోల నిర్మాణం నిషేధానికి సంబంధించిన‌ చట్టంలోని ర‌క‌ర‌కాల‌ సెక్షన్ల కింద అతనిపై కేసు నమోదు చేశారు. రెండు నెల‌ల పాటు అత‌డు జైలు జీవితాన్ని అనుభ‌వించాక బెయిల్ మంజూరైంది.

శిల్పా ఈ కేసులో తన ఏకైక ప్రకటనలో చెప్పిన విష‌యం ఇప్పుడు ప్ర‌జ‌లు గుర్తు చేసుకుంటున్నారు. ``తాను చట్టాన్ని గౌరవించే భారతీయ పౌరురాలిని`` అని .. మీడియా ఇతరులు తనపై `అసమర్థమైన ఆక్షేపణలు` చేయ‌డంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. త‌న గోప్య‌త‌ను.. పిల్లలు వియాన్ - సమీషా కోసం తన కుటుంబ గోప్యతను గౌరవించాలని ఆమె అందరినీ కోరింది. అయితే నీలి చిత్రాల దందా శిల్పాశెట్టికి తెలియ‌కుండానే రాజ్ కుంద్రా న‌డిపించారా? అంటూ పెద్ద ఎత్తున విమ‌ర్శ‌లు వెల్లువెత్తిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిదానికి స‌మాధానం చెప్పేందుకు శిల్పాశెట్టి చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వ‌స్తోంది. ఇప్పుడు భ‌ర్త సోష‌ల్ మీడియాల నుంచి వైదొలిగాక తానే స‌మాధాన‌మివ్వాల్సి వ‌చ్చింది. ఇక ఇంత‌కుముందు త‌న వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి రాజ్ కుంద్రా కొన్నేళ్ల పాటు విదేశాల‌కు వెళ్లిపోతార‌ని క్లూ అందింది.
Tags:    

Similar News