క్రికెట్‌తో హీరోయిన్లకు నయా ఆఫర్లు

Update: 2015-04-07 05:47 GMT
క్రికెట్‌-సినిమా బంధం విడదీయరానిది. ప్రతి విషయంలో ఈ రెండిటికి సాన్నిహిత్యం షురూ.. క్రికెటర్లకు, కార్పొరెట్‌కు కథానాయికలతో ఎఫైర్‌ అవసరం. రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తలు, ధనవంతులంతా గుమిగూడే చోటు ఇది. అందుకే ఇక్కడ గ్లామర్‌ కూడా ఎక్కువవుతోంది. క్రికెట్‌ సినిమా వసూళ్లను సైతం ప్రభావితం చేస్తోంది అంటే దాని పవరెంతో అర్థం చేసుకోవచ్చు.

చీర్‌గాళ్స్‌ రూపంలో కిక్కు పెంచారు. రోజు రోజుకి గ్లామర్‌ని కలుపుకుని ముందుకు సాగుతుండడంతో క్రికెట్‌ వల్ల సినిమాకి మరింత ప్రమాదం ముంచుకొస్తోంది. అయితే క్రికెట్‌ అనేది కథానాయికల పాలిట వరంగా మారుతోంది. కేవలం స్టార్‌ హీరోయిన్లకు మాత్రమే కాదు, చోటా మోటా హీరోయిన్లకు సైతం ఇది కొత్త అవకాశాల్ని తెచ్చిపెడుతోంది. ఈనెల 8 నుంచి ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ప్రారంభమవుతోంది. ఇందులో కథానాయికల హవా కూడా ఎక్కువగానే ఉంటుంది.

స్టేడియంలో గ్లామర్‌ ఆకర్షణ ఎక్కువే. ఐపీఎల్‌ నిర్వాహకులంతా కార్పొరెట్‌ బాబులే కాబట్టి కథానాయికల్ని వీక్షకులకు ఎరగా వేస్తున్న మాట వాస్తవం. అయితే టోర్నమెంట్‌ జరుగుతుండగానే సదరు కథానాయికలను సరికొత్త అవకాశాలు వరించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ప్రతి మ్యాచ్‌ తర్వాత క్లబ్బులు, పబ్బుల్లో పార్టీలు, హోటల్‌రూమ్స్‌లో మీటింగులు ఉంటాయి. అక్కడే సెటిల్‌మెంట్లు కూడా జరుగుతుంటాయి. వాణిజ్య ప్రకటనల్లో నటించే అవకావాల్ని సైతం నాయికలు అందుకునేది ఇలాంటప్పుడే.

అయితే కార్పొరెట్‌ ప్రపంచంతో సాన్నిహిత్యం మెయింటెయిన్‌ చేస్తున్న వారికి ఇలాంటి అవకాశాలొస్తున్నాయి. ఈసారి ఐపీఎల్‌ సిరీస్‌లో మన తెలుగు కథానాయికలు ఎంతవరకూ సందడి చేస్తారు? కార్పొరెట్‌తో అనుబంధం ఎంతవరకూ పెంచుకుంటారు? అన్న దానిన బట్టి ప్రకటనల్లో నటించే అవకాశం ఉంటుందన్నమాట!
Tags:    

Similar News