సినిమాల్లో రోమాంచితంగానూ..రొమాంటిక్ గా కనిపించే కొన్నిసీన్లు రియల్ లైఫ్ లో అందుకు భిన్నంగా ఉంటాయి. ఫాంటసీలు తప్పు లేదు కానీ.. ఆ పిచ్చలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే చుట్టు ఉన్న ప్రభుత్వం ఒప్పుకోదు. ఆ విషయాన్ని అర్థం చేసుకునే లోపు పోలీసులు అరెస్ట్ చేశారు. సంచలనంగా మారిన ఈ ఉదంతం గురించి వింటే ఊపిరి ఆడనట్లుగా మారుతుంది. ఇక.. వారు చేసిన రొమాన్స్ కు ఆధారంగా మిగిలిన ఫోటోను చూస్తే.. ఒళ్లు జలదరింపు ఖాయం.
చాలా సినిమాల్లో ఎత్తైన భవనం గోడ అంచు మీద హీరో.. హీరోయిన్లు కూర్చోవటం.. కబుర్లు చెప్పటం.. ఆ సందర్భంగా కాస్తంత రొమాన్సులోకి వెళ్లటం చూస్తుంటాం. వెండితెర మీద చూస్తున్నప్పుడు బాగుంటుంది కానీ.. నిజ జీవితంలో అలాంటి సాహనాలు లేనిపోని చిక్కుల్ని తెచ్చి పెడుతుంటాయి. ఇరాన్ కు చెందిన 28 ఏళ్ల అథ్లెట్ అలీ రజా జపలాఘీ అనే సెలబ్రిటీ ఉన్నాడు. ఒళ్లు గగుర్పాటుకు గురి చేసే విన్యాసాలకు కేరాఫ్ అడ్రస్ గా చెబుతారు. ఆ దేశ క్రీడా సెలబ్రిటీల్లో ఒకడిగా చెప్పే అతడు.. ఊహించని రీతిలో వ్యవహరించి వివాదంలో ఇరుక్కున్నాడు.
నిబంధనలకు విరుద్ధంగా అతడు.. అతడి ప్రియురాలు కలిసి ఒక ఎత్తైన భవనం అంచున ముద్దు పెట్టుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోను వారు సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఆ ఫోటోను చూస్తే.. ముందుగా ప్లాన్ చేసుకున్న షూట్ గా చెప్పాలి. ఒకవైపు టెహ్రాన్ నగరం కనిపించేలా పాయింట్ ఎంపిక చేసుకొని.. సూర్యాస్తమయ వేళలో తన గాళ్ ఫ్రెండ్ తో ఘాటు ముద్దు ఇస్తూ ఫోటోలు తీసుకున్నారు.
సోషల్ మీడియాలో ఈ ఫోటో పెను సంచలనంగా మారింది. నెటిజన్లు తలో రకంగా రియాక్టు అయ్యారు. అధికారులు మాత్రం.. ఈ ఫోటోలో అశ్లీలతతో పాటు.. నిబంధనలకు ఉల్లంఘించిన వైనాన్ని గుర్తించి వెంటనే అతడ్ని అరెస్టు చేశారు. ఫోటోలోని అలీరజా ప్రియురాలిని కూడా అరెస్టు చేశారు. అనవసరమైన సాహసాలు చేయటం.. అడ్డంగా బుక్ అయిపోవటం కొందరికి ఇష్టంగా ఉండొచ్చు. కానీ.. ఇలాంటి వారిని అనుకరించే ప్రయత్నంలో కొందరు అమాయకులు తమ ప్రాణాల్ని పోగొట్టుకోవటాన్ని మర్చిపోకూడదు.