బాలయ్యతో 'ఐరన్‌ మ్యాన్‌' తీస్తాడట

Update: 2019-10-18 13:34 GMT
టాలీవుడ్‌ విలక్షణ దర్శకుడు రవిబాబు. ఈయన దర్శకత్వం వహించిన మొదటి చిత్రం 'అల్లరి' నుండి మొదలుకుని ఇటీవల పంది పిల్లతో చేసిన 'అదుగో' చిత్రం వరకు అన్ని వేటికి అవే విభిన్నమైన చిత్రాలుగా నిలిచాయి. సినిమా సినిమాకు చాలా వేరియేషన్స్‌ చూపించడంతో పాటు కొత్త వారితో.. చిన్న నటీనటులతో సినిమాలు చేస్తూ దర్శకుడిగా సక్సెస్‌ లు దక్కించుకుంటున్నాడు. నటుడిగా.. దర్శకుడిగా రవిబాబు ఈమద్య కాస్త స్లో అయ్యాడు అనిపిస్తుంది. ఈ సమయంలోనే ఈయన 'ఆవిరి' అనే విభిన్నమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.

ఇటీవల రవిబాబు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాకు బాలకృష్ణ గారితో ప్రత్యేకమైన అనుబంధం ఉంది. ఆయన నాతో చాలా జోవియల్‌ గా మాట్లాడుతారు. బాలకృష్ణ గారు గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రం తర్వాత నాకు ఫోన్‌ చేసి నువ్వు అందరితో సినిమాలు తీస్తున్నావు.. మరి నాతో సినిమా ఎప్పుడు చేస్తావని అడిగారు. మీతో వర్క్‌ చేయడం చాలా గౌరవం అన్నాను. అప్పుడు ఆయన కూడా నీతో వర్క్‌ చేయడం నాకు గౌరవం అన్నాడు.

ఇప్పుడు కాకున్నా భవిష్యత్తులో ఎప్పుడైనా సినిమా చేస్తానేమో. ఒకవేళ ఆయనతో సినిమా చేస్తే కథ ఏదైనా.. నేపథ్యం ఏదైనా కూడా 'ఐరన్‌ మ్యాన్‌' అనే టైటిల్‌ ను పెడతానంటూ రవిబాబు అన్నాడు. ఆ టైటిల్‌ కు ఆయన సరిగ్గా సూట్‌ అవుతాడని తన అభిప్రాయం అంటూ రవిబాబు చెప్పుకొచ్చాడు. బాలకృష్ణ మరియు రవిబాబుల కాంబోలో సినిమా వస్తే అది సెన్షేషనల్‌ అవ్వడం కన్ఫర్మ్‌. కాని రావడమే అనుమానం.


Tags:    

Similar News