ఎవరూ ఊహించని విధంగా ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా ప్రకటన అందరికీ ఓ స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. 'మహానటి' తర్వాత దర్శకుడు నాగ్ అశ్విన్ చాలా రోజులు ఈ స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న సంగతి తెలుసు కానీ అది మెగాస్టార్ చిరంజీవి కోసమని అందరూ అనుకున్నారు. ఏదేమైనా ఈ ప్రాజెక్టు మాత్రం భారీ స్థాయిలో ఉండబోతోందనేది స్పష్టం. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ అవుతుంది.
సినిమా ప్రకటన రాగానే నాగ అశ్విన్ ఎలాంటి కథ రెడీ చేశాడు.. సినిమా ఎలా ఉండబోతోందనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. టైమ్ మిషన్.. కాలంలో ప్రయాణం నేపథ్యంలో కథ అనగానే తెలుగులో సూపర్ హిట్ సినిమా 'ఆదిత్య 369' అందరికీ గుర్తుకు వస్తుంది. నందమూరి బాలకృష్ణ హీరోగా సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ చిత్రం బాలయ్య కెరీర్లోనే ఒక మరపురాని చిత్రం. విక్రమ్ కుమార్- సూర్య '24' టైమ్ ట్రావెల్ నేపథ్యమే కానీ ప్రేక్షకులను పెద్దగా మెప్పించ లేకపోయింది.
ఇప్పుడు నాగ్ అశ్విన్ టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో ఓ అద్భుతమైన కథను రెడీ చేశారని.. ఈ సినిమాకు భారీ స్థాయి లో విజువల్ ఎఫెక్ట్స్ అవసరమని అంటున్నారు. సినిమా కథ ప్రభాస్ స్థాయికి తగ్గట్టుగా ఉంటుందని.. దేశవ్యాప్తంగానే కాదు ఇతర దేశాలలో ఉండే ప్రభాస్ అభిమానులను కూడా మురిపించేలా ఉంటుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ కూడా మొదలు పెట్టారట.