బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ ఈ ఏడాది ఇప్పటివరకు నాలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత ఏడాది కరోనా కంగారు పెట్టినా.. సినిమాలను అడ్డుకున్నా కూడా ఈ సూపర్ స్టార్ మాత్రం ఏకంగా మూడు సినిమాలను విడుదల చేశాడు. సినిమాల సంఖ్య అయితే భారీగా పెరుగుతుంది కానీ ఈయన సక్సెస్ రేటు అంతకంతకు తగ్గుతోంది.
ఈ ఏడాదిలో బచ్చన్ పాండే మొదలుకుని సామ్రాట్ పృథ్వీరాజ్.. రక్షా బంధన్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడ్డాయి. ఆ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో కట్ పుట్లీ ని డైరెక్ట్ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు. తాజాగా ఈ సినిమా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ద్వారా ఓటీటీ లో స్ట్రీమింగ్ అయ్యింది.
ఈ సినిమా విడుదలకు ముందు ఏమాత్రం బజ్ లేదు అంటూ మనం గతంలోనే మాట్లాడుకున్నాం. సినిమాకు థియేట్రికల్ రిలీజ్ అయిన సమయంలో చేసినంతగా ప్రమోషన్ చేయలేదు. కనీసం పెద్ద ప్రెస్ మీట్ లు లేదా ఈవెంట్ లు నిర్వహించలేదు. దాంతో సినిమాకు బజ్ క్రియేట్ అవ్వలేదు. అయితే విడుదల తర్వాత పాజిటివ్ టాక్ తో ప్రేక్షకుల్లోకి వెళ్తుందని అంతా భావించారు.
సినిమా విడుదల తర్వాత కూడా పరిస్థితి మారలేదు. పైగా సినిమాకి నెగటివ్ రివ్యూలు రావడంతో పాటు నెగటివ్ మౌత్ పబ్లిసిటీ మొదలు అయ్యింది. తెలుగు లో బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన రాక్షసుడు సినిమా కి రీమేక్ అనే విషయం తెల్సిందే. కొందరు ఒరిజినల్ చూసిన వారు ఈ రీమేక్ చూసి పెదవి విరుస్తున్నారు.
సినిమా స్క్రీన్ ప్లే లో చిన్న చిన్న మార్పులు చేసి ఉన్నది ఉన్నట్లుగానే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా మేకర్స్ ప్లాన్ చేశారు. అయినా కూడా హిందీ వర్షన్ ప్రేక్షకులకు నిరాశ పర్చింది.
ఈ సినిమా తో అయినా సూపర్ స్టార్ కి వరుస ఫ్లాప్ ల దండ యాత్రకు అడ్డు కట్ట పడుతుందని భావిస్తే అనూహ్యంగా మరో ఫ్లాప్ కూడా అక్షయ్ ఖాతాలో ఈ సినిమా రూపంలో పడింది. ఆయన నుండి ఇదే ఏడాదిలో మరోటి లేదా రెండు సినిమాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కనీసం ఆ సినిమాలు అయినా ఈయనకు సక్సెస్ ను తెచ్చి పెడతాయా అనేది చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.