ఆ సినిమా సెట్ లో అనుష్క అసిస్టెంట్ లా?

Update: 2022-09-10 10:32 GMT
ఇండియ‌న్ గ్రేట్ మూవీ 'బాహుబ‌లి' ప్రాంచైజీ సంచ‌ల‌నాల గురించి చెప్ప‌దేముంది. బాహుబ‌లి రెండు భాగాలు అద్భు త‌మైన విజ‌యాన్ని సాధించాయి. తెలుగు సినిమా ఖ్యాతిని విశ్వ‌వ్యాప్తం చేసిన గొప్ప ప్రాంచైజీ అది. ఇండియ‌న్ సినిమాగాను బాహుబ‌లి స‌రికొత్త రికార్డు సృష్టించింది. బాక్సాఫీస్ వసూళ్ల‌తో పాటు...జాతీయ అంతార్జాతీయ అవార్డుల‌తోనే బాహుబ‌లి స‌త్క‌రించ‌బడింది.

దీనంత‌టికి ఒకే ఒక్క కార‌కుడు ద‌ర్శ‌క‌దిగ్గ‌జం రాజ‌మౌళి. అత‌ని వ‌ల్లే ఇదంతా సాధ్య‌మైంది. ఈ ప్రాంచైజీ ప్రారంభం నుంచి ముగింపు ..రిలీజ్ వ‌ర‌కూ వ‌రకూ జ‌క్క‌న్న ఎంత‌గానో  శ్ర‌మించారు అన్న‌ది మాట‌ల్లో చెప్ప‌లేనిది. ప్ర‌చారం విష‌యంలోనూ త‌న‌కంటూ ఓ స్ర్టాట‌జీ ఉంద‌ని  ఈ సినిమాతోనే ప్రేక్ష‌కుల‌కి అర్ధ‌మైంది.  ఆర‌కంగా  సినిమాల‌పై త‌న‌కున్న ఫ్యాష‌న్ అంతా బాహుబ‌లిలో క‌నిపించింది.

అందుకే బాహుబ‌లి సినిమాకి సంబంధించి ప్ర‌తీది రాజ‌మౌళికి ఎంతో స్పెష‌ల్ అని చెప్పాలి. తాజాగా బాహుబ‌లి సినిమా కి సెట్ సంబంధించిన ఓ థ్రో బ్యాక్ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. ఇందులో శివ‌గామి అవ‌తారంలో ర‌మ్య‌కృష్ణ క‌నిపిస్తున్నారు. ఆమె కుర్చిలో కూర్చుని ఉండ‌గా..ఆమెకి ఎదురుగా నేల‌పైన‌  దేవ‌సేన పాత్ర పోషించిన అనుష్క క్రింద‌ కూర్చుని ఉన్నారు.

ఇద్ద‌రు ఏదో విష‌యంపై సీరియ స్ గా డిస్క‌స్ చేస్తున్నారు. ప‌క్క‌నే మాహిష్మాతి సామ్రాజ్యం భ‌టులు..ఆచార్య‌లు క‌నిపిస్తున్నారు. అయితే అనుష్క సినిమా సెట్ లో ఫ్యాంట్ -టీష‌ర్ట్ సాధార‌ణ దుస్తుల్లో క‌నిపిస్తున్నారు.

నెత్తికి క్యాప్ కూడా ధ‌రించారు. చేతిలో వాకిటాకీ క‌నిపిస్తుంది. అనుష్క‌ని ఇలా చూస్తుంటే ఈ సినిమాకి అసిస్టెంట్..అసోసియేట్ డైరెక్ట‌ర్ గా ఏమైనా ప‌నిచేసిందా? అన్న సందేహం రాక‌మానదు.

అమ్మ‌డి ఆహర్యం అలాగే క‌నిపిస్తుందిక్క‌డ‌. మ‌రి షూట్ అనంత‌రం ఇలా మ‌స్తాబైందా?  లేక ఆరోజు సెట్ లో టైంపాస్ చేస్తుందా? అన్న‌ది మ‌రో సందేహం. ఈ ఫోటోని ఉద్దేశించి ప్లాష్ బ్యాక్ ప్రైడ్ అనే క్యాప్ష‌న్ కూడా ఇచ్చారు. అంటే స‌రిగ్గా ఈ షూట్ కి సంబంధించిన స‌న్నివేశాలు శుక్ర‌వారం రోజున షూట్ చేసి ఉండొచ్చు. దాని గుర్తుగానే అదే రోజున ఆ ఫో టోని షేర్ చేసుకుని ఆ నాటి శుక్ర‌వారాన్ని యూనిట్ గుర్తు చేసుకుంటుంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News