బుల్లి తెరపై తనదైన ముద్ర వేసిన ఓంకార్ దర్శకుడిగా కూడా సక్సెస్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాజుగారి గదితో సక్సెస్ ను దక్కించుకున్న ఓంకార్ ఆ తర్వాత అదే జోనర్ లో వరుసగా చిత్రాలు చేస్తున్నాడు. నాగార్జున ప్రధాన పాత్రలో 'రాజుగారి గది 2' చిత్రాన్ని చేశాడు. సమంత కూడా నటించిన ఆ చిత్రంపై అంచనాలు భారీగా వచ్చాయి. అయితే అంచనాలను ఆ సినిమా అందుకోవడంలో విఫలం అయ్యింది. రాజుగారి గది 2 ఫ్లాప్ అవ్వడంతో ఆ సిరీస్ ను ఓంకార్ వదిలేస్తాడేమో అని అంతా భావించారు. కాని రాజు గారి గది 3ని తాజాగా ప్రారంభించాడు.
రెండవ పార్ట్ లో నాగార్జున మరియు సమంత వంటి స్టార్స్ ఉన్నా కూడా ఆకట్టుకోలేక పోయిన ఓంకార్ ఈసారి తమ్ముడు అశ్విన్ బాబుతో మూడవ పార్ట్ కు సిద్దం అయ్యాడు. హీరోయిన్ గా తమన్నాను ఎంపిక చేశాడు. హర్రర్ సినిమాలు వరుసగా చేసి ఫ్లాప్ అయిన తమన్నాను ఈ చిత్రంకు తీసుకోవడం ఆశ్చర్యంగా ఉంది. అభినేత్రి చిత్రంతో పర్వాలేదు అనిపించినా అభినేత్రి 2 చిత్రంతో మాత్రం తమన్నా ఆకట్టుకోలేదు. హర్రర్ పాత్రను పోషించడంలో విఫలం అయ్యింది.
అశ్విన్ మరియు తమన్నా వంటి పెద్దగా క్రేజ్ లేని స్టార్స్ తో ఈసారి రాజు గారి గదిని తీస్తున్న ఓంకార్ తప్పకుండా సక్సెస్ దక్కించుకుంటాననే నమ్మకంతో ఉన్నాడు. స్టార్స్ లేని కారణంగా కంటేంట్ చాలా బలంగా ఉండాలి. అప్పుడే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మొదటి పార్ట్ లో ఎంటర్ టైన్ మెంట్ ఎక్కువగా ఉన్న కారణంగా మాస్ ఆడియన్స్ ఆధరించారు. మళ్లీ అదే తరహా ఎంటర్ టైన్ మెంట్ తో వస్తానంటే మాత్రం కుదరదు. రాజు గారి గది 3 చాలా విభిన్నంగా వినూత్నంగా ఉంటేనే సక్సెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓంకార్ మాత్రం చాలా నమ్మకంగా ఉన్నాడు. మరి ఇది అతి నమ్మకం అయ్యేనా చూడాలి.