అడల్ట్ స్టఫ్ కు రామ్ రామ్ చెబుతున్న మన్మథుడు?

Update: 2019-07-12 05:44 GMT
రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అక్కినేని నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రం 'మన్మథుడు 2'.  ఇప్పటికే రిలీజ్ అయిన ప్రోమోలు సినిమాపై ఆసక్తిని పెంచాయి.  అయితే బోల్డ్ డైలాగులు.. కిస్సులపై మాత్రం మిక్స్డ్ రియాక్షన్స్ వచ్చాయి.  ఈ వయసులో నాగార్జున ఇలా బోల్డ్ బాట పట్టడం ఏంటని.. సగం వయసున్న హీరోయిన్లతో కిస్సులు ఏంటని కొందరు విమర్శలు కూడా చేశారు.  ఈ రియాక్షన్ ను నాగ్ కొంచెం సీరియస్ గా తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది.

ఈమధ్య బోల్డ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆదరణ పొందుతున్నప్పటికీ వివాదాలు మాత్రం చుట్టుముడుతున్నాయి.  అయితే ఆ సినిమాల్లో హీరోలు ఈ జెనరేషన్ వారు కాబట్టి చెల్లుతోంది.  కానీ నాగ్ విషయానికి వస్తే..  నాగ్ రొమాంటిక్ సినిమాలు చేసినా ఇప్పటికీ క్లీన్ ఇమేజ్ ఉంది.  దాదాపు ముప్పై ఏళ్ళ కెరీర్లో ఎప్పుడు బోల్డ్ టచ్ ఉండే సినిమాలు చేయలేదు.  ఈ సినిమాలో అడల్ట్ టచ్ ఉంటే.. నాగ్ ను ఎక్కువగా ఆదరించే మహిళా ప్రేక్షకులు దూరమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నాడట.  అందుకే అడల్ట్ కంటెంట్ ను తొలగించాల్సిందిగా దర్శకుడు రాహుల్ ను కోరాడట.  అనవసరమైన వివాదాలలో ఇరుక్కోవడం నాగ్ కు ఇష్టంలేదని.. అది కూడా ఈ అడల్ట్ స్టఫ్ కు రామ్ రామ్ చెప్పడానికి మరో కారణమని సమాచారం.  నాగ్ సూచన ప్రకారం రాహుల్ ఈ సినిమానుండి అడల్ట్ కంటెంట్ ను తొలగించే పనిలో పడ్డాడట.

అంతా బాగానే ఉంది కానీ సినిమాను ఒక ఫ్లేవర్ లో తెరకెక్కించినప్పుడు అలానే ఉండడం బెటర్ అని.. స్క్రిప్ట్ దశలోనే మార్పులు చేస్తే సరే కానీ ఇప్పుడు మార్పు చేర్పులు చేస్తే సినిమా ఫ్లేవర్ దెబ్బతినే అవకాశం ఉంటుందని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.  అడల్ట్ స్టఫ్ తొలగించిన 'మన్మథుడు 2' మసాలా లేని బిర్యానిలా తయారైతే మాత్రం కష్టమే.  ఏం జరుగుతుందో వేచి చూడాలి.

 
    

Tags:    

Similar News