చోళ సామ్రాజ్య వైభవాన్ని వెండితెరపై ఆవిష్కరించాలని దర్శకుడు మణిరత్రం చేసిన ప్రయత్నం 'పొన్నియిన్ సెల్వన్'. గత మూడు దశాబ్దాలకు మించి ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ని తెరపైకి తీసుకురావాలని విశ్వప్రయత్నాలు చేసిన మణిరత్నం ఎట్టకేలకు తన చిరకాల స్వప్నమైన 'పొన్నియిన్ సెల్వన్' ప్రాజెక్ట్ ని వ్యవ ప్రయాసల కోర్చి మొత్తానికి వెండితెరపై ఆవిష్కరించారు. వందల కోట్ల మేర ఖర్చు చేసిన మణిరత్నం ఎట్టకేలకు తన చిరకాల స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు.
రెండు భాగాలుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ మూవీ పార్ట్ 1' పొన్నియిన్ సెల్వన్ 1' సెప్టెంబర్ 30న ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక భారీ ఎక్స్ పెక్టేషన్స్ తో థియేటర్లలకు వచ్చి ప్రేక్షకుల్ని తీవ్ర నిరాశకు గురిచేసింది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఈ మూవీపై డివైడ్ టాక్ మొదలైంది. సినిమా ఏ విషయంలోనూ ప్రేక్షకుల్ని ఎంగేజ్ చేయలేకపోయిందనే కామెంట్ లు సర్వత్రా వినిపిస్తున్నాయి.
భారీ పీరియాడిక్ లార్జర్ దెన్ లైఫ్ సినిమాల్లో వుండాల్సిన ఎగ్జైటింగ్, ఎమోషనల్ సీన్ లు, ప్రేక్షకుల్ని రోమాంచిత అనుభూతికి లోను చేసే సన్నివేశాలు లేకపోవడం 'పొన్నియిన్ సెల్వన్ 1' ప్రధాన బలహీనతలని తేలింది.
దీంతో ప్రేక్షకులు ఈ మూవీపై బాహాటంగానే పెదవి విరుస్తున్నారు. మణిరత్నం విజువల్ గ్రాండీయర్, మేకింగ్ విలవువలపై పెట్టిన శ్రద్ధ సగటు ప్రేక్షకుడిని రంజింపజేసే ఎమోషన్స్ ని మాత్రం పట్టుకోలేక పోయాడని, అదే ఈ మూవీకి ప్రధాన డ్రా బ్యాక్ గా మారిందని అంటున్నారు.
ఇదిలా వుంటే ఫస్ట్ పార్ట్ 'పొన్నియిన్ సెల్వన్ 1' రిలీజ్ కి ముందే మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్ 2' షూటింగ్ ని పూర్తి చేసేశారట. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. 'పొన్నియిన్ సెల్వన్ 1' ఫలితాన్ని దృష్టిలో పెట్టుకుని మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్ 2' విషయంలో ఆ తప్పుల్ని సరి చేసుకుంటారా? కీలక సన్నివేశాలని మరింత బలంగా బలమైన భావోద్వేగాలని జోడించి మళ్లీ రీ షూట్ చేస్తారా? అనే కామెంట్ లు వినిపిస్తున్నాయి.
ముందు ఈ మూవీని వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. అయితే తాజా పరిణామాల నేపథ్యంలో ఆ డేట్ మారే అవకాశం వుందని తెలుస్తోంది. ఇప్పటికైనా మణిరత్నం ఫస్ట్ పార్ట్ విషయంలో జరిగిన తప్పుల్ని సెకండ్ పార్ట్ లో పునరావృతం కాకుండా చూసుకుని ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించగలిగితేనే పార్ట్ 2 పై హోప్స్ పెట్టుకోవచ్చు లేదంటే పార్ట్ 2 కూడా సేమ్ రిజల్ట్ ని రాబడుతుందనడంతో ఎలాంటి సందేహం లేదని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.