యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ విడుదలకు ముందు వరకు వరుస సినిమాలతో తెగ హడావుడి చేశాడు. రాధేశ్యామ్ విడుదల అవ్వడమే ఆలస్యం మారుతి దర్శకత్వంలో రాజా డీలక్స్ సినిమాను ప్రకటిస్తాడు అంటూ వార్తలు వచ్చాయి. అంతే కాకుండా సలార్ మరియు ప్రాజెక్ట్ కే సినిమాలను కూడా చాలా స్పీడ్ గా పూర్తి చేసి ఒకటి ఇదే ఏడాది విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తారు అంటూ వార్తలు వచ్చాయి.
రాధేశ్యామ్ విడుదల తర్వాత ప్రభాష్ మళ్లీ చిన్న చిన్న షెడ్యూల్స్ కు తప్ప లాంగ్ షెడ్యూల్స్ షూటింగ్ కు హాజరు అవ్వడం లేదు. ఇటీవల ప్రాజెక్ట్ కే సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో రెండు మూడు రోజులు కేటాయించిన ప్రభాస్ మళ్లీ ఖాళీగా ఉన్నాడు అనే వార్తలు వస్తున్నాయి. ఆయన రాధేశ్యామ్ మిగిల్చిన డ్యామేజీ నుండి బయటకు రాలేక పోతున్నాడు అంటూ టాక్ వినిపిస్తుంది.
ప్రభాస్ సలార్ మరియు ప్రాజెక్ట్ కే సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. ఆదిపురుష్ సినిమా షూటింగ్ పూర్తి అయ్యి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. మరో వైపు స్పిరిట్ మూవీ ఇంకా పట్టాలెక్కలేదు. ఇక రాజా డీలక్స్ సినిమా చర్చల దశలో ఉంది. ఇన్ని సినిమాలు ఉన్న హీరో ఎంత స్పీడ్ గా షూటింగ్ లో పాల్గొనాలి చెప్పండి. కాని ప్రభాస్ మాత్రం చాలా డల్ గా ఉన్నాడు. ఆయన ఏమాత్రం హడావుడి లేడు అంటూ స్వయంగా అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
ప్రభాస్ షూటింగ్ లకు హాజరు కాక పోవడంతో ఆయన నటిస్తున్న అన్ని సినిమాలు కూడా చాలా ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ప్రభాస్ నుండి వచ్చే ఏడాది సంక్రాంతికి ఆది పురేష్ రాబోతుంది. ఆ వెంటనే సమ్మర్ లో సలార్ ను విడుదల చేయాలని భావిస్తున్నారు. కాని ప్రభాస్ షూటింగ్ లకు ఏదో ఒక విషయం చెప్పి తప్పించుకోవడం తో విమర్శలు వస్తున్నాయి.
అయితే ప్రభాస్ సన్నిహితుల మరో విధంగా స్పందిస్తున్నారు. హైదరాబాద్ లో ఎండలు మండుతున్నాయి. ఇలాంటి సమయంలో షూటింగ్ అంటే ఖచ్చితంగా భారీ నష్టం తప్పదు. అందుకే ప్రభాస్ జూన్ రెండు లేదా మూడవ వారం వరకు షూటింగ్ కార్యక్రమాలకు హాజరు కాకూడదు అని భావిస్తున్నాడట.
కేవలం తనకు మాత్రమే కాకుండా తన స్టాఫ్ మరియు ఇతర స్టాఫ్ కు కూడా ఎండ నుండి రక్షణ కోసం ఈ నిర్ణయం తీసుకున్నాడట. సమ్మర్ పూర్తి అయిన తర్వాత వరుసగా ప్రభాస్ కమిట్ అయిన సినిమాలను ముగించే అవకాశం ఉంది.