సూపర్ స్టార్ మళ్ళి అదే డైరెక్టర్ ని నమ్ముతున్నాడా?

Update: 2022-06-24 02:30 GMT
త‌మిళ సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ 'రోబో' త‌రువాత ఆ స్థాయి విజ‌యాన్ని అందుకుని చాలా కాల‌మే అవుతోంది. గ‌త ప‌న్నెండేళ్ల కాలంలో ర‌జ‌నీ దాదాపు ఎనిమిది చిత్రాల‌కు పైగా చేశారు. కానీ అందులో క్రేజీ స్టాన్ డైరెక్ట‌ర్ల‌ల‌తో చేసిన ఏ మూవీ కూడా ర‌జ‌నీకి సూప‌ర్ హిట్ ని అందించ‌లేక‌పోయాయి. అయినా స‌రే బ్యాక్ టు బ్యాక్ ర‌జ‌నీ యంగ్ డైరెక్ట‌ర్ల‌కు బ్యాక్ టు బ్యాక్ అవ‌కాశాలు ఇస్తూనే వున్నారు.. అదే స్థాయిలో ఫ్లాపుల్ని సొంతం చేసుకుంటున్నారు.

ఇటీవ‌ల 'సిరుతై' శివ డైరెక్ష‌న్ లో ర‌జ‌నీ చేసిన మూవీ 'అన్నాత్తే'. స‌న్ పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై క‌ళానిధి మార‌న్ నిర్మించిన ఈ మూవీని తెలుగులో 'పెద్ద‌న్న‌' పేరుతో విడుద‌ల చేశారు. క్రేజీ స్టార్స్ అంతా క‌లిసి న‌టించిన ఈ మూవీ రెండు భాష‌ల్లోనూ పెద్ద‌గా ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోయింది. విచిత్రం ఏంటంటే ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి ఎప్పుడు వ‌చ్చిందో.. ఎప్పుడు వెళ్లిందో ఎవ‌రికి తెలియ‌దు. ఈ మూవీ త‌రువాత మ‌ళ్లీ ర‌జ‌నీ ఇదే స‌న్ పిక్చ‌ర్స్ సంస్థ‌కు మ‌రో భారీ మూవీకి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.

ద‌ళ‌ప‌తి విజ‌య్ తో 'బీస్ట్' మూవీని రూపొందించిన నెల్స‌న్ దిలీప్ కుమార్ ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్నారు. అనిరుధ్ సంగీతం అందించ‌బోతున్నాడు. త్వ‌ర‌లోనే ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది. ర‌జ‌నీ న‌టిస్తున్న 169వ సినిమా ఇది. దిలా వుంటే ఈ మూవీ త‌రువాత ర‌జ‌నీ మ‌రోసారి సాహ‌సానికి రెడీ అవుతున్న‌ట్టుగా వార్త‌లు వినిపిస్తున్నాయి. 'క‌బాలి', 'కాలా' వంటి చిత్రాల‌ని అందించిన పా. రంజిత్ .. ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి ర‌జ‌నీతో సినిమా చేయ‌బోతున్నాడ‌ట‌.

ఇది ర‌జ‌నీ 170వ సినిమాగా తెర‌పైకి రానుంద‌ని కోలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. ర‌జ‌నీ కెరీర్ లో పా. రంజిత్ రూపొందించిన 'క‌బాలి' రిలీజ్ కు ముందు ఏ స్థాయి సంచ‌ల‌నాలు సృష్టించిందో అంద‌రికి తెలిసిందే.. దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్న ఈ మూవీ అదే స్థాయిలో బాక్సాఫీస్ వ‌ద్ద తుస్సుమంది. భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లైన ఈ మూవీ ఫ్యాన్స్ ని తీవ్ర నిరుత్సాహానికి గురిచేసింది. అయిత‌నా స‌రే ర‌జ‌నీ .. పా. రంజిత్ కు మ‌రో అవ‌కాశం ఇచ్చారు.

అదే 'కాలా'. ముంబై నేప‌థ్యంలో సాగే ఈ మూవీపై కూడా భారీగానే బ‌జ్ క్రియేట్ అయింది. నానా ప‌టేక‌ర్ విల‌న్ గా న‌టించ‌డంతో ఇదేదో బాక్సులు బ‌ద్దలు కొట్టేలా వుందే అని జోరుగా ప్ర‌చారం సాగింది. కానీ ఈ మూవీ కూడా 'క‌బాలి' త‌ర‌హాలోనే ఉసూరుమ‌నిపించింది. రెండు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద భారీ వైఫ‌ల్యాలుగా నిలిచినా ర‌జ‌నీ ద‌ర్శ‌కుడు పా.

రంజిత్ కు ముచ్చ‌ట‌గా మూడ‌వ సారి అవ‌కాశం ఇస్తున్నార‌ని చెబుతున్నారు. ఇది స‌హ‌స‌మేన‌ని, ఇలా ఏ హీరో చేయ‌ని సాహ‌సాన్ని ర‌జ‌నీ .. పా. రంజిత్ కోసం చేస్తున్నాడ‌ని అంత ఆకామెంట్ లు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ నిజంగా కార్య‌రూపం దాలుస్తుందా?  లేదా అన్న‌ది తెలియాలంటే ప్ర‌స్తుతం నెల్స‌న్ దిలీప్ కుమార్ చేస్తున్న మూవీ పూర్తి అయితే కానీ క్లారిటీ రాదు అంటున్నారు.
Tags:    

Similar News