మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్ 'ఆర్.ఆర్.ఆర్' మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో రామ్ చరణ్ 'మన్నెం దొర అల్లూరి సీతారామరాజు' క్యారక్టర్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత తన హోమ్ బ్యానర్ కొణిదల ప్రొడక్షన్ లో మెగాస్టార్ చిరంజీవి - కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఆచార్య'లో కీలక పాత్ర పోషించబోతున్నాడు. అయితే అందరు హీరోలు వరుసగా ప్రాజెక్ట్స్ ఓకే చేస్తున్న తరుణంలో చరణ్ నెక్స్ట్ ఏ చిత్రం చేయబోతున్నాడని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఓ కొత్త డైరెక్టర్ తో చేయబోతున్నాడనే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.
కాగా ప్రస్తుతం ఇంటికే పరిమితమైన చరణ్ ఫ్యామిలీ తో కలిసి ఎంజాయ్ చేస్తున్నాడు. అంతే కాకుండా కొత్త కొత్త స్క్రిప్ట్స్ వింటూ వస్తున్నాడట చరణ్. ఈ క్రమం లో అప్ కమింగ్ డైరెక్టర్ సతీష్ చెప్పిన స్టోరీ లైన్ కి చరణ్ ఇంప్రెస్స్ అయ్యాడట. దీంతో ఏఈ స్టోరీ లైన్ డెవలప్ చేసి పూర్తి స్క్రిప్ట్ తీసుకు రమ్మని సతీష్ కి సూచించాడట. ఇప్పటికే ఆ పని లో ఉన్న ఈ యంగస్టర్ కంప్లీట్ త్వరలోనే చరణ్ ని మరోసారి కలవనున్నాడట. ఆ ఫైనల్ స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులతో చరణ్ ఓకే చేసి ఈ సినిమా పట్టాలెక్కుదేమో చూడాలి. రామ్ చరణ్ తన కెరీర్ లో ఇప్పటి వరకు డెబ్యూ డైరెక్టర్ తో వర్క్ చేయలేదు. ఇప్పుడు ఇదే కనుక నిజమై ఈ ప్రాజెక్ట్ లైన్లోకి వస్తే మాత్రం చరణ్ కొత్త దర్శకుడి తో వర్క్ చేయబోయే ఫస్ట్ సినిమా అవుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.